- సెయిలింగ్‌లో రజతం, స్క్వాష్‌లో కాంస్యం
నగోయా: ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాల వేట కొనసాగిస్తున్నారు. పురుషుల స్కిఫ్ సెయిలింగ్ విభాగంలో మను ఫ్రాన్సిస్, ప్రిన్స్ నోబుల్ కురిసింకల్ జోడీ రజత పతకం సాధించింది. ఈ విభాగంలో చైనా స్వర్ణం, హాంకాంగ్ కాంస్యం గెలుచుకున్నాయి. మరోవైపు మహిళల స్క్వాష్ జట్టు కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. అనాహత్ సింగ్, జోష్నా చినప్ప, తన్వి ఖన్నా, షమీనా రియాజ్తో కూడిన భారత జట్టు సెమీఫైనల్లో హాంకాంగ్ చేతిలో ఓడింది. దీంతో భారత్‌కు కాంస్యం దక్కింది. మను ఫ్రాన్సిస్, ప్రిన్స్ నోబుల్ కురిసింకల్ లు మలయాళీ సెయిలింగ్ స్టార్లు కావడం విశేషం.
ఇక పురుషుల వాలీబాల్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. క్వార్టర్‌ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత పురుషుల వాలీబాల్ జట్టు చివరిసారిగా 1986లో కాంస్యం సాధించగా, 1962లో రజతం గెలుచుకుంది.








కామెంట్‌లు (0)