మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఐసీసీ చైర్మన్‌గా రెండోసారి జై షా ఏకగ్రీవ ఎన్నిక

18 గంటల క్రితం

ఐసీసీ చైర్మన్‌గా రెండోసారి జై షా ఏకగ్రీవ ఎన్నిక
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 10:56 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా జై షా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇండోనేషియాలోని బాలిలో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లండ్, జింబాబ్వే, న్యూజిలాండ్‌తో పాటు అసోసియేట్ సభ్య దేశాల క్రికెట్ ప్రతినిధులు ఆయన నాయకత్వానికి మద్దతు తెలిపారు.

2024 ఆగస్టు 27న తొలిసారి ఐసీసీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన జై షా, అదే ఏడాది డిసెంబర్ 1న గ్రెగ్ బార్క్లే స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. 36 ఏళ్ల వయసులో ఈ పదవిని చేపట్టి ఐసీసీ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన చైర్మన్‌గా గుర్తింపు పొందారు.

జై షా రెండోసారి ఎన్నిక కావడంపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) చైర్మన్ రిచర్డ్ థాంప్సన్ హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్‌ను బలోపేతం చేయడంతో పాటు ద్వైపాక్షిక సిరీస్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలని, పోటీతత్వాన్ని కాపాడాలని అభిప్రాయపడ్డారు. సంప్రదాయ క్రికెట్ విలువలను కాపాడుతూనే కొత్త ప్రేక్షకులను ఆకర్షించేందుకు సాంకేతిక ఆవిష్కరణలు, మారుతున్న వాణిజ్య పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగాలని పేర్కొన్నారు.

తనపై నమ్మకం ఉంచిన ఐసీసీ బోర్డు సభ్యులకు జై షా కృతజ్ఞతలు తెలిపారు. చైర్మన్ బాధ్యతలు తనకు గౌరవంతో పాటు గొప్ప బాధ్యత అని పేర్కొన్నారు. 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ ప్రవేశం ద్వారా కొత్త ప్రేక్షకులకు ఈ క్రీడను పరిచయం చేయడంతో పాటు యువతను క్రికెట్ వైపు ఆకర్షించవచ్చని తెలిపారు. అభిమానులు, ఆటగాళ్లు, వాణిజ్య భాగస్వాములకు ప్రయోజనం చేకూరేలా ప్రపంచ క్రికెట్ భవిష్యత్తును మరింత బలోపేతం చేయడమే తన లక్ష్యమని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్