న్యూఢిల్లీ : భారత సీనియర్ లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ అంతర్జాతీయ, భారత దేశవాళీ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 38 ఏళ్ల కర్ణ్ శర్మ భారత్ తరపున ఒక టెస్టు మ్యాచ్, రెండు వన్డేలు, ఒక టి-20 ఆడాడు. ప్రస్తుతం యుపి టి-20 లీగ్‌లో కాన్పూర్ సూపర్‌స్టార్స్‌కు ఆడుతున్న ఇతను.. ఈ నెల 25న మీరట్ మావెరిక్స్‌తో ఆడే మ్యాచ్ తనకు చివరిదని పేర్కొన్నాడు. రిటైర్మెంట్ తర్వాత కోచింగ్, క్రికెట్‌కు సంబంధించిన ఇతర బాధ్యతలు చేపట్టడానికి అందుబాటులో ఉంటానన్నాడు. ఇన్నాళ్లు తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు.
కర్ణ్ శర్మకు అంతర్జాతీయ కెరీర్‌లో పెద్దగా అవకాశాలు రాకపోయినప్పటికీ ఐపిఎల్‌లో మంచి బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ టోర్నీలో 90 మ్యాచ్‌లు ఆడి 83 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు మూడు వేర్వేరు జట్లతో వరుసగా మూడు ఐపిఎల్ టైటిళ్లను గెల్చుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ (2016), ముంబయి ఇండియన్స్ (2017), చెన్నై సూపర్ కింగ్స్ (2018) తరపున ఐపిఎల్ టైటిళ్లను ముద్దాడాడు.








కామెంట్‌లు (0)