గురువారం, 08 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసెమీస్‌కు మానుష్‌-మానవ్‌

5 గంటల క్రితం

manush-manav.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 08, 2026, 10:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బీజింగ్‌: చైనా స్మాష్‌-2026 టేబుల్‌ టెన్నిస్‌(టిటి) పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లోకి మానుష్‌ షా-మానవ్‌ ఠక్కర్‌ ప్రవేశించారు. గురువారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో భారత జంట 3-0తో చైనా జంటను చిత్తుచేశారు. ఏకపక్ష‍ంగా సాగిన ఈ మ్యాచ్‌లో మానుష్‌-మానవ్‌ 11-9, 11-5, 11-4తో చైనాకు చెందిన లింగ్‌ జింగ్‌కున్‌-షింగ్‌ పెంగ్‌ లను ఓడించారు. ఈ మ్యాచ్‌ను భారత జంట కేవలం 19 నిమిషాల్లోనే ముగించడం గమనార్హం. సెమీస్‌లో భారతజంట కొరియా, స్వీడన్‌ మ్యాచ్‌ విజేతతో తలపడనున్నారు. ఇక మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత్‌కు చెందిన మానుష్‌-దియా జంట క్వార్టర్‌ ఫైనల్లో ఓటమిపాలైంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత జంట 3-1(11-7, 9-11, 12-10, 11-4తో చైనీస్‌ తైపీకి చెందిన లిన్‌ యున్‌-చెంగ్‌ చిన్‌ల చేతిలో ఓటమిపాలయ్యారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్