న్యూజిలాండ్ 70/5 నుంచి 243/5కు
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో ప్రారంభమైన తొలి టెస్ట్‌లో టీమిండియా పేసర్లు తొలుత రాణించినా.. ఆ తర్వాత కివీస్ బ్యాటర్లు నికోల్స్, ఫిలిప్స్ అద్భుత పోరాట పటిమను చూపారు. దీంతో తొలిరోజు ఆట ముగిసేసరికి న్యూజిలాండ్ జట్టు 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. 70 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ కివీస్‌ను నికోల్స్ సెంచరీ, ఫిలిప్స్ అర్ధసెంచరీతో ఆదుకున్నారు. వీరిద్దరూ 6వ వికెట్‌కు ఇప్పటికే 173 పరుగులు జతచేశారు. టీమిండియా బౌలర్ జస్పీత్ బుమ్రా తొలుత మెరిసినా.. ఆ తర్వాత న్యూజిలాండ్ అద్భుత పోరాట పటిమ కనబరిచింది. న్యూజిలాండ్ ఆదిలోనే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును వీరిద్దరూ క్రీజ్‌లో కుదురుకొని గౌరవప్రద స్కోర్‌కు చేర్చారు. నికోల్స్(113) సెంచరీకి తోడు ఫిలిప్స్(94) క్రీజ్‌లో ఉన్నారు. దీంతో కివీస్ తిరిగి పుంజుకుంది. ఫలితంగా తొలి రోజు ఆట ముగిసే సరికి న్యూజిలాండ్ ఐదు వికెట్ల నష్టానికి 243 పరుగులు చేయగలిగింది. అంతకుముందు టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆది నుంచే భారత పేసర్లు చెలరేగారు. ఓపెనర్లలో కెప్టెన్ టామ్ లాథమ్‌ను జస్‌ప్రీత్ బుమ్రా డకౌట్ చేయగా.. డెవాన్ కాన్వేను నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అన్షుల్ కాంబోజ్ పెవిలియన్‌కు పంపాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రచిన్ రవీంద్ర (15) వికెట్‌ను ఆకాశ్ దీప్ తన ఖాతాలో వేసుకోగా.. డారిల్ మిచెల్ (1) రూపంలో మరో కీలక వికెట్‌ను బుమ్రా దక్కించుకున్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ బ్లండెల్ (5) కూడా వెనక్కి పంపాడు. ఫలితంగా ఉదయం సెషన్‌లో న్యూజిలాండ్ కేవలం 70 పరుగులు చేసి ఏకంగా ఐదు వికెట్లు కోల్పోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వన్‌డౌన్ బ్యాటర్ హెన్రీ నికోల్స్, ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ కలిసి అద్భుత రీతిలో పోరాడారు. భారత బౌలర్లు బుమ్రాకు మూడు, అన్షుల్ కాంబోజ్, ఆకాశ్ దీప్ చెరో వికెట్ తీశారు.
స్కోర్‌బోర్డు...
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: లాథమ్ (బి)బుమ్రా 0, కాన్వే (సి)పంత్ (బి)కంబోజ్ 4, నికోల్స్ (బ్యాటింగ్) 113, రచిన్ రవీంద్ర (సి)పంత్ (బి)ఆకాశ్‌దీప్ 15, మిఛెల్ (సి)జైస్వాల్ (బి)బుమ్రా 1, బ్లండెల్ (సి)గిల్ (బి)బుమ్రా 5, ఫిలిప్స్ (బ్యాటింగ్) 94, అదనం 11. (82ఓవర్లలో 5వికెట్ల నష్టానికి) 243పరుగులు.
వికెట్ల పతనం: 1/2, 2/12, 3/51, 4/52, 5/70 బౌలింగ్: బుమ్రా 17-5-52-3, కంబోజ్ 18-4-57-1, ఆకాశ్ 15-5-33-1, ప్రసిధ్ 16-2-58-0, సుందర్ 16-2-38-0.








కామెంట్‌లు (0)