ఆదివారం, 02 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

వన్డే ప్రపంచకప్‌ వేదికలు ఖారారు

1 రోజు క్రితం

icc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 31, 2026, 10:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- 12 నగరాలు, 14 జట్లు, 57 మ్యాచ్‌లు

దుబాయ్‌: పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2027 కోసం 12 వేదికలను ఐసిసి అధికారికంగా ప్రకటించింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా వచ్చే ఏడాది ఈ మెగా టోర్నీ జరగనుంది. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమం అనంతరం ఐసిసి ఈ ప్రకటన విడుదల చేసింది. ‘త్రీ నేషన్స్, వన్ హార్ట్ బీట్' పేరిట ఈ ప్రకటన విడుదలైంది. ప్రపంచ కప్ 14వ ఎడిషన్‌లో మొత్తం 57 మ్యాచ్‌లు జరుగుతాయని, ఇందులో 14 జట్లు 12 నగరాల్లో ఈ మ్యాచులు జరుగుతాయని పేర్కొంది. వీటిలో దక్షిణాఫ్రికాలోని ఎనిమిది నగరాలు, జింబాబ్వేలో మూడు నగరాలు, నమీబియా రాజధాని విండ్ హోక్ ఆతిథ్య వేదికలుగా ఎంపికయ్యాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, కెన్యా సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన 2003 ఎడిషన్ తర్వాత ఆఫ్రికాలో జరుగుతున్న తొలి పురుషుల వన్డే ప్రపంచకప్ ఇదే కావడం గమనార్హం. 24 ఏళ్ల తర్వాత మెగా ఈవెంట్ ఆఫ్రికాకు తిరిగి రావడం పట్ల ఐసీసీ ఛైర్మన్ జై షా స్పందించారు. ఇది క్రికెట్ చరిత్రలో కీలక మైలురాయిగా అభివర్ణించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్