- జడేజా అర్ధసెంచరీ
- ఇండియా తొలి ఇన్నింగ్స్ 357/6
కొలంబో : శ్రీలంక ఎలెవెన్‌తో జరుగుతున్న ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్‌లో దేవదత్ పడిక్కల్ అజేయ శతకంతో రాణించాడు. భారత జట్టు ఆదిలో తడబడినా రెండోరోజు చివరి వరకు క్రీజ్‌లో నిలబడి ఇండియాను ఆదుకున్నాడు. ప్రధాన ఆటగాళ్లు విఫలమైనా.. దేవ్‌దత్ పడిక్కల్(142 నాటౌట్ ) భారీ శతకంతో మెరిసాడు. మరోవైపు కేఎల్ రాహుల్(41), రవీంద్ర జడేజా(63 రిటైర్డ్ హర్ట్) విలువైన భాగస్వామ్యంతో రెండోరోజు ఆట ముగిసేసరికి భారతజట్టు 90 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. మానవ్ సుతార్(41) కూడా చివర్లో రాణించడంతో టీమిండియాను ఆలౌట్ చేయాలనుకున్న లంక బౌలర్ల ఆశలు ఆవిరయ్యాయి. ఓవర్‌నైట్ స్కోర్ 8వికెట్ల నష్టానికి 363 పరుగుల వద్ద శ్రీలంక ఎలెవెన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో రెండోరోజు తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. యశస్వీ వికెట్(0) రెండోబంతికే డకౌటయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ కెఎల్ రాహుల్, పడిక్కల్ దూకుడుగా ఆడారు. అర్ధ శతక భాగస్వామ్యంతో లంక బౌలర్ల సహనాన్ని పరీక్షించిన ఈ ద్వయాన్ని కేశర నువాంత(1/40) విడదీశాడు. ఆ తర్వాత వచ్చిన రిషభ్ పంత్(2), ధ్రువ్ జురెల్(1)లు విఫలమైనా.. పడిక్కల్ ఏమాత్రం ఒత్తిడికి గురికాక స్కోర్ బోర్డును నడిపించాడు. ఆఖర్లో మానవ్ సుతార్(41) సైతం రాణించగా భారత్ స్కోర్ దాటింది. అనంతరం గుర్నూర్ బ్రార్(36 నాటౌట్) జతగా లంక బౌలర్లను కాచుకున్న పడిక్కల్ అజేయంగా నిలిచాడు. దాంతో, రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌లో మరో 6 పరుగులు వెనకబడి ఉంది. శ్రీలంక ఎలెవెన్ బౌలర్లు మనోజ్, మెండీస్‌కు రెండేసి, నువాంత, ఫెర్నాండోకు ఒక్కో వికెట్ దక్కాయి. ఆదివారం ఆఖరి రోజు కావడంతో వామప్ మ్యాచ్ డ్రాగా ముగియడం ఖాయం.
స్కోర్‌బోర్డు...
ఇండియా తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి)సుధీర (బి)ఫెర్నాండో 0, కెఎల్ రాహుల్ (బి)నువాంత 40, పడిక్కల్ (బ్యాటింగ్) 142, జడేజా (రిటైర్డ్ హార్ట్) 63, పంత్ (సి)మధుష్క (బి)ఆర్.మెండీస్ 2, జురెల్ (సి)ధనుంజయ (బి)ఆర్.మెండీస్ 1, మానవ్ సుతార్ (ఎల్‌బి)అసంక మనోజ్ 41, కుల్దీప్ (రిటైర్డ్‌హార్ట్) 1, సిరాజ్ (సి అండ్ బి)మనోజ్ 1, సురాన్ష్ జైన్ (రిటైర్డ్ హార్ట్) 22, గుర్నూర్ బ్రార్ (బ్యాటింగ్) 36, అదనం 8. (90 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి) 357పరుగులు. వికెట్ల పతనం: 1/0, 2/96, 3/170, 4/174, 5/256, 6/257 బౌలింగ్: ఫెర్నాండో 14-2-42-1, లాహిరు 12-3-42-0, విజు 8-1-51-0, మెండీస్ 18-3-77-2, నువాంత 17-3-40-1, దినుషా 4-0-9-0, మనోజ్ 8-1-32-2, సుధీర 9-0-58-0.
గాయపడ్డ సాయి సుదర్శన్
శ్రీలంకతో ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగలిగింది. నంబర్-3 బ్యాటర్ సాయి సుదర్శన్ కాలి గాయంతో టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో టీమిండియా జట్టులో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ సిరీస్ కోసం ఎంపికైన బుమ్రా ఇప్పటికే దూరమయ్యాడు. అతడి స్థానంలో ఆకిబ్ నబీ జట్టులోకి వచ్చాడు. తాజాగా సాయి సుదర్శన్ సైతం బొటనవేలి గాయంతో దూరమయ్యాడు. దీంతో మరో ఆటగాడిని ఎంపిక చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. సాయి స్థానంలో తుది జట్టులోకి ఎవరిని తీసుకోవాలనే దానిపై సెలెక్టర్లు దృష్టి సారించారు.








కామెంట్‌లు (0)