బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అభిషేక్,విరాట్ రికార్డులు బద్దలు కొట్టిన..పాకిస్థాన్ కొత్త కెప్టెన్

1 గంట క్రితం

pak.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 06:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఆటగాడు సాహిబ్జాదా ఫర్హాన్ శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శనతో సరికొత్త రికార్డులు సృష్టించాడు.ఈ సిరీస్‌ను పాకిస్థాన్ 2-1తేడాతో గెలుచుకుంది.తొలిసారి పూర్తి స్థాయి టీ20కెప్టెన్‌గా వ్యవహరించిన ఫర్హాన్ అరుదైన విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు.మూడు మ్యాచ్‌లలోనూ అర్ధశతకాలు బాది మొత్తం 238పరుగులు సాధించాడు.

ఈ ప్రదర్శనతో గతంలో భారత్ ఓపెనర్ అభిషేక్ శర్మ పేరు మీద ఉన్న రికార్డును ఫర్హాన్ బద్దలు కొట్టాడు.గత నెలలో ఢిల్లీ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన సిరీస్‌లో అభిషేక్ శర్మ మూడు మ్యాచ్‌లలో కలిపి229పరుగులు చేయగా,ఇప్పుడు ఆ రికార్డును ఫర్హాన్ అధిగమించాడు.ఈ జాబితాలో కొలిన్ మున్రో223పరుగులతో మూడో స్థానంలో,డేవిడ్ వార్నర్217పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నారు.

అలాగే..ద్వైపాక్షిక టీ20సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లలోనూ 50లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ప్రపంచంలోని ఎనిమిదవ బ్యాటర్‌గా ఫర్హాన్ నిలిచాడు.పాకిస్థాన్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 2016జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో ఈ రికార్డును తొలిసారి నమోదు చేశాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్