సోమవారం, 05 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionభువనేశ్వర్‌కు పగ్గాలు

3 గంటల క్రితం

bhuvaneswar.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026, 11:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • హాంకాంగ్ సిక్సెస్‌కు జట్టు ప్రకటన

ముంబయి: హాంకాంగ్‌ వేదికగా జరిగిన ‘హాంకాంగ్‌ సిక్సెస్‌-2026’ టోర్నీకి భారతజట్టు కెప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్‌ ఎంపికయ్యాడు. ఫ్రాంచైజీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న భువనేశ్వర్‌.. హాంకాంగ్ సిక్సెస్‌-2026 ఎడిషన్‌ కోసం బిసిసిఐ ప్రకటించిన 8మంది ఆటగాళ్ల స్క్వాడ్‌కు సారథ్యం వహించనున్నాడు. హాంకాంగ్ సిక్సెస్‌ – 2026 ఎడిషన్‌లో ప్రతి జట్టులో ఆరుగురు ఆటగాళ్లతో మాత్రమే జరిగే ఈ టోర్నీలో.. కృనాల్ పాండ్యా, నటరాజన్‌, త్రిపాఠి, తెవాటియా, నితీశ్‌, శశాంక్ సింగ్‌లతో కూడిన బృందాన్ని నడిపించనున్నాడు. కెప్టెన్‌గా ఎంపికైన భువి మాట్లాడుతూ.. ‘టీమిండియాకు ఆడిన అనుభవం ఉపయోగపడుతుందని భావిస్తున్నా.. మరోసారి టీమిండియా జెర్సీ ధరించే అవకాశం దక్కడం గొప్ప అనుభూతి. హాంకాంగ్ సిక్సెస్‌లో భారత జట్టుకు సారథ్యం వహించేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’ అని తెలిపాడు. ఇక ఐపీఎల్ 19వ సీజన్‌లో భువనేశ్వర్ 16 మ్యాచుల్లో 28 వికెట్లతో ఆర్సీబీ విజయంలో కీలకమయ్యాడు. గత సీజన్‌ కెప్టెన్ దినేశ్ కార్తిక్ భారతజట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇక హాంకాంగ్‌లోని టిన్ క్వాంగో రోడ్ రిక్రియేషన్ మైదానంలో అక్టోబర్ 30 నుంచి నవంబర్1 వరకు 2026 ఎడిషన్‌ జరగనుంది. 1992లో మొదలైన ఈ టోర్నీ రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది. హాంకాంగ్ సిక్సెస్ 2026 ఎడిషన్‌లో మొత్తం పన్నెండు జట్లు పోటీపడనున్నాయి.

గ్రూప్‌లు (ఎ): హాంకాంగ్ చైనా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్. (బి): శ్రీలంక, బంగ్లాదేశ్, స్కాట్లాండ్. (సి): ఇండియా, పాకిస్థాన్, యూఏఈ. (డి): దక్షిణాఫ్రికా, ఆఫ్గనిస్థాన్, ఒమన్.

భారత జట్టు: భువనేశ్వర్ కుమార్(కెప్టెన్), కృనాల్ పాండ్యా, శశాంక్ సింగ్, రాహుల్ తెవాటియా, నితీశ్ రానా, రాహుల్ త్రిపాఠి, టి.నటరాజన్.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్