గురువారం, 08 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసుందర్‌, కమిలినికి నజరానా అందజేత

5 గంటల క్రితం

award.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 08, 2026, 10:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చెన్నై: ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన పురుషుల, మహిళల క్రికెట్‌ జట్టులోని ఆటగాళ్లు, వాషింగ్టన్‌ సుందర్‌, కమిలినిలకు తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్‌ విజయ్‌ రూ. 75 లక్షల చెక్కును అందజేశారు. ఈ క్రీడల్లో భారత మహిళల, పురుషుల క్రికెట్‌ జట్లు స్వర్ణ పతకాలు సాధించిన వెంటనే సీఎం విజయ్‌ నజరానా ప్రకటించారు. ప్రకటించిన విధంగా సుందర్‌, కమలిని స్వరాష్ట్రానికి చేరుకున్న వెంటనే నగదు రివార్డును అందజేశారు. కాగా, ఆసియా క్రీడల మహిళల క్రికెట్‌ ఫైనల్లో భారత్‌ శ్రీలంకపై 147 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇక పురుషుల విభాగంలో టీమిండియా.. పాకిస్తాన్‌పై 19 పరుగుల తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకాల్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్