- యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ నేడు పురుషుల సింగిల్స్ సెమీస్ పోరు
న్యూయార్క్: యుఎస్ ఓపెన్ టెన్నిస్-2026 మహిళల సింగిల్స్ ఫైనల్లోకి టాప్ సీడ్, బెలారస్‌కు చెందిన అర్యానా సబలెంకా, 2వ సీడ్, కజకిస్తాన్‌కు చెందిన ఎలేనా రైబకినా ప్రవేశించారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో రైబకినా మూడుసెట్ల హోరాహోరీ పోరులో అమెరికాకు చెందిన 4వ ర్యాంకర్ కోకో గాఫ్‌ను చిత్తుచేయగా.. మరో సెమీస్‌లో సబలెంకా వరుససెట్లలో 3వ సీడ్, అమెరికాకే చెందిన జెస్సికా పెగూలాను ఓడించింది. కోకో గాఫ్‌తో జరిగిన తొలి సెమీస్‌లో రైబకినా తొలి సెట్‌ను చేజార్చుకున్నా.. ఆ తర్వాత రెండు సెట్లను చేజిక్కించుకొని అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. హోరాహోరీగా సాగిన ఆ సెమీస్‌లో రైబకినా 3-6 6-4 6-4 స్కోరుతో ముగించింది. ఇక టాప్‌సీడ్ సబలెంక.. హ్యాట్రిక్ యుఎస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీపై కన్నేసింది. శుక్రవారం జరిగిన సెమీస్‌లో సబలెంకా 7-5 6-2 స్కోరుతో అమెరికన్ ప్లేయర్ జెస్సికా పెగులాపై విజయం సాధించింది. ఇద్దరు టాప్-2 క్రీడాకారిణులు తుదిపోరుకు ప్రవేశించడం మరో విశేషం. 2013 తర్వాత యుఎస్ ఓపెన్ ఫైనల్లో ఇద్దరు టాప్ సీడ్లు పోటీపడడం ఇదే తొలిసారి. గత ఏడాది కూడా సెమీస్‌లోనే సబలెంకా మూడవ సీడ్ పెగులాను చిత్తుచేసి ఫైనల్‌కు చేరగా.. ఈ ఏడాది కూడా పెగూలానూ సెమీస్‌లోనే చిత్తుచేయడం విశేషం. ఈ మ్యాచ్‌లో సబలెంకా మొత్తం ఏడు ఏస్‌లతో సహా మొత్తం 29 విన్నర్ షాట్లు కొట్టింది.
దిగ్గజాల రికార్డుపై సబలెంకా గురి...
2024, 2025లలో యుఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సబలెంకా హ్యాట్రిక్‌పై కన్నేసేంది. సబలెంకా టైటిల్ సాధిస్తే వరుసగా ఇది మూడుసార్లు యూఎస్ ఓపెన్ టైటిల్ కానుంది. దీంతో వరుసగా మూడుసార్లు యుఎస్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గిన క్రిస్ ఎవర్ట్ మరియు సెరెనా విలియమ్స్ సరసన సబలెంక చేరనుంది. శనివారం జరిగే టైటిల్ పోరులో టాప్ సీడ్ అరినా సబలెంకాతో రైబకినా తలపడనుంది. సబలెంకా టైటిల్ గెలిస్తే.. తన టాప్ ర్యాంక్‌ను అలాగే కొనసాగించనుంది. ఓడితే 99 వారాల నుంచి వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్‌లో కొనసాగుతున్న సబలెంకా.. రెండో ర్యాంక్‌లో ఉన్న కజకిస్థాన్ ప్లేయర్ రైబకినా టాప్‌కు ఎగబాకనుంది.
నేడు పురుషుల సింగిల్స్ సెమీస్ పోరు
యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ పోరు శనివారం జరగనుంది. తొలి సెమీస్‌లో టాప్‌సీడ్ అలెగ్జాండర్ జ్వెరేవ్(జర్మనీ)తో అన్‌సీడెడ్ కరెన్ ఖచనోవ్(రష్యా) తలపడనున్నాడు. ఇక రెండో సెమీస్ అమెరికాకు చెందిన 8వ ర్యాంకర్ బెన్ షెల్టన్, 11వ ర్యాంకర్ ఫ్రాన్సిస్ టఫీల మధ్య జరగనుంది.








కామెంట్‌లు (0)