శుక్రవారం, 09 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionRSA vs AUS, 1st Test: ఆస్ట్రేలియా 187/6

4 గంటల క్రితం

sa vs aus.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026, 11:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఆదుకున్న రెన్‌షా, కమిన్స్‌

  • దక్ష‍ిణాఫ్రికాతో తొలిటెస్ట్‌

డర్బన్‌: ఆస్ట్రేలియాతో ప్రారంభమైన తొలి టెస్టులో దక్ష‍ిణాఫ్రికా పేసర్లు సమిష్టిగా చెలరేగారు. యాన్సెన్‌, ముల్డర్‌, నోర్ట్జే రెండేసి వికెట్లు పడగొట్టి ఆసీస్‌ నడ్డి విరిచారు. దీంతో ఆసీస్‌ జట్టు 124పరుగులకే 6వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ దశలో రెన్‌షా, కమిన్స్‌ మరో వికెట్‌ పడకుండా ఆదుకున్నారు. దీంతో తొలిరోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా జట్టు 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు మాడిసన్‌(0), హెడ్‌(9) స్వల్ప స్కోర్లకే పెవీలియన్‌కు చేరారు. 24పరుగులకే 2వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను లబూషేన్‌(37), స్మిత్‌(25) ఆదుకున్నారు. కానీ వికెట్‌ కీపర్‌ క్యారీ(14), వెబ్‌స్టర్‌(4) కూడా నిరాశపరచడంతో ఆసీస్‌ 124 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో రెన్‌ షా(46), కెప్టెన్‌ కమిన్స్‌(33) మరో వికెట్‌ పడకుండా క్రీజ్‌లో పాతుకుపోయారు. వెలుతురు లేమి కారణంగా తొలిరోజు కేవలం 65ఓవర్ల ఆట మాత్రమే కొనసాగింది. మూడు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు దక్ష‍ిణాఫ్రికా పర్యటనకు వచ్చింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్