- జడేజా, కుల్దీప్, మానవ్‌కు రెండేసి వికెట్లు
- మధుష్క, రవిందు, దినుషా అర్ధ సెంచరీలు
- శ్రీలంక ఎలెవెన్ 363/8
కొలంబో: శ్రీలంక ఎలెవెన్‌తో ప్రారంభమైన మూడ్రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు చివర్లో చెలరేగారు. జడేజా, కుల్దీప్‌కి తోడు యువ స్పిన్నర్ మానవ్ సుతార్ రెండేసి వికెట్లతో రాణించారు. దీంతో తొలిరోజు ఆట ముగిసేసరికి శ్రీలంక జట్టు 8వికెట్ల నష్టానికి 363పరుగులు చేసింది. 3వికెట్ల నష్టానికి 246పరుగులతో పటిష్టంగా ఉన్న లంకను స్పిన్నర్లు బోల్తా కొట్టిం చారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఎలెవెన్ జట్టు లంచ్ విరామ సమయానికి వికెట్ నష్టానికి 138 పరుగులతో పటిష్టంగా ఉంది. తొలి వికెట్‌కు నిషాన్ మధుష్క(66), రవిందు రసంత(71) తొలి వికెట్‌కు 110 పరుగుల భాగస్వా మ్యం నెలకొల్పారు. 66 పరుగులు చేసిన నిషాన్ రనౌటయ్యాడు. భారత జట్టు కెప్టెన్ గిల్ గాయం కారణంగా కేఎల్ రాహుల్ టాస్‌కు వెళ్లాడు.
తొలుత విఫలమైన బౌలర్లు
టాస్ ఓడిన టీమిండియా బౌలర్లు తొలుత తేలిపోయారు. ఆతిథ్య జట్టు వికెట్లు పడగొట్టేందుకు తీవ్రంగా శ్రమించారు. తొలి వికెట్‌కు శ్రీలంక ఓపెనర్లు ఏకంగా 110 పరుగుల భాగస్వామ్య నెలకొల్పి భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ఆ తర్వాత సమన్వయ లోపం కారణంగా మధుష్క రనౌట్ కావడంతో భారత్‌కు తొలి వికెట్ దక్కింది. ఆ తర్వాత వచ్చిన పవన్ రాత్నాయకే(39), అహన్ విక్రమసింఘే(31), కెప్టెన్ సోనల్ దినుష(52), రమేష్ మెండిస్(32) నిలకడగా ఆడి జట్టు స్కోర్ 350 పరుగుల మార్క్‌ను దాటించారు. ఆ దశలో భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ తలా రెండు వికెట్లు పడగొట్టి శ్రీలంక ఎలెవెన్ జట్టు భారీస్కోర్ చేయకుండా నిలువరించారు. సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్ 13 ఓవర్లు బౌలింగ్ చేసినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. గుర్నూర్ బ్రార్‌కు ఒక వికెట్ లభించినా.. స్పిన్నర్లు ఆరు వికెట్లు పడగొట్టి పట్టు సాధించారు. తొలిరోజు ఆట ముగిసేసరికి నువాంత(9), సుధీర(1) క్రీజ్‌లో ఉన్నారు.
స్కోర్‌బోర్డు..
శ్రీలంక ఎలెవెన్ ఇన్నింగ్స్: మధుష్క (రనౌట్)మానవ్/కెఎల్ రాహుల్ 66, రవీందు (సి)హర్ష్ దూబే (బి)మానవ్ 71, సూరియ భండారా (బి)జడేజా 35, రత్నాయకే (సి)పడిక్కల్ (బి)గుర్నూర్ బ్రార్ 39, విక్రమ సింఘే (సి)గుర్నూర్ బ్రార్ (బి)కుల్దీప్ 31, సునాల్ దినుషా (ఎల్‌బి)మానవ్ సుతార్ 52, భండారా (ఎల్‌బి)కుల్దీప్ 13, రమేశ్ మెండీస్ (సి)పడిక్కల్ (బి)జడేజా 32, నువాంత (బ్యాటింగ్) 9, సుధీరా (బ్యాటింగ్) 1, అదనం 14. (90 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి) 363పరుగులు.
వికెట్ల పతనం: 1/110, 2/171, 3/201, 4/246, 5/250, 6/284, 7/347, 8/354.
బౌలింగ్: సిరాజ్ 13-2-44-0, ప్రసిధ్ కృష్ణ 8-1-32-0, జడేజా 15-2-64-2, గుర్నూర్ బ్రార్ 12-1-49-1, కుల్దీప్ 18-0-76-2, మానవ్ సుతార్ 13-1-33-2, సుర్యాన్ష్ జైన్ 11-0-54-0.








కామెంట్‌లు (0)