- సెమీస్‌లో హువాంగ్‌పై గెలుపు
- తైపీ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
తైపీ: తైపీ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ సూపర్-300లో భారత మహిళా యువ షట్లర్ తాన్వీ శర్మ సంచలనం నమోదు చేసింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో తనకంటే మెరుగైన ర్యాంక్ క్రీడాకారిణి హు-సన్-హువాంగ్‌ను ఓడించింది. ఏకపక్షంగా సాగిన గేమ్‌లో తాన్వీ 21-17, 21-11తో 5వ ర్యాంక్ క్రీడాకారిణి, తైపీకి చెందిన హువాంగ్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ కేవలం 33 నిమిషాల్లోనే ముగిసింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తాన్వీ శర్మ 34వ ర్యాంక్ క్రీడాకారిణి. ఆదివారం జరిగే ఫైనల్లో నుయెన్(వియత్నాం)తో తలపడనుంది. మరో సెమీస్‌లో నుయేన్ 15-21, 18-21తో 3వ ర్యాంకర్, భారత్‌కు చెందిన ఉన్నతి హుడాను ఓడించింది. ఇక పురుషుల సింగిల్స్‌లో కిరణ్ జార్జి ఓటమిపాలయ్యాడు. శనివారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో కిరణ్ జార్జి 12-21, 10-21తో జపాన్‌కు చెందిన 4వ ర్యాంక్ ఆటగాడు వుదాయ్ ఒకిమోటో చేతిలో ఓడాడు.








కామెంట్‌లు (0)