ఆదివారం, 02 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

సెమీస్‌‌కు తాన్వీ, ఉన్నతి

1 రోజు క్రితం

re
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 31, 2026, 10:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- తైపీ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ ‌టోర్నీ

తైపీ: తైపీ ఓపెన్‌ సూపర్‌ బ్యాడ్మింటన్‌-300 టోర్నీలో ఉన్నతి హుడా, తాన్వీ శర్మ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ‌ఫైనల్లో ఉన్నతి హుడా వరుససెట్లలో ప్రత్యర్ధిని చిత్తుచేయగా.. తాన్వీ శర్మ మూడుసెట్ల ఉత్కంఠ పోరులో ప్రత్యర్ధిని ఓడించి సెమీస్‌‌కు చేరింది. ఏకపక్షంగా సాగిన క్వార్టర్‌ ‌ఫైనల్లో ఉన్నతి 23-21, 21-16తో భారత్‌‌కే చెందిన దేవిక సిహాంగ్‌ను చిత్తుచేసింది. తొలి గేమ్‌‌లో ఉన్నతి హుడా 11-3తో ఆధిక్యతలో నిలిచినా.. చివర్లో 21-21తో స్కోర్‌ ‌సమమైంది. ఆ దశలో వరుసగా రెండు పాయింట్లు సాధించి ఉన్నతి ఆ గేమ్‌‌ను గెలుచుకుంది. రెండో గేమ్‌‌లోనూ ప్రత్యర్ధికి ఏమాత్రం అవకాశమివ్వకుండా సునాయాసంగా చేజిక్కించుకొని మ్యాచ్‌‌ను ముగించింది. సెమీస్‌‌లో ఉన్నతి వియత్నాంకు చెందిన 18ఏళ్ల నుయేన్‌‌తో తలపడనుంది. ఇక 17ఏళ్ల తాన్వీ శర్మ 21-15, 18-21, 21-14 మూడుసెట్ల హోరాహోరీ పోరులో థాయ్‌‌లాండ్‌‌కు చెందిన సుపనిందను ఓడించి సెమీస్‌‌కు చేరింది. సెమీస్‌‌లో తానీ శర్మ తైపీకి చెందిన 5వ సీడ్‌ ‌హాంగ్‌‌తో తలపడనుంది. ఇక పురుషుల సింగిల్స్‌ ‌క్వార్టర్‌ ‌ఫైనల్లో కిరణ్‌ ‌జార్జి ప్రవేశించాడు. ప్రీ క్వార్టర్స్‌‌లో కిరణ్‌ ‌జార్జి 21-15, 21-16తో భారత్‌‌కే చెందిన మన్నేపల్లిను ఓడించాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్