శుక్రవారం, 16 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గెలిపించిన దీప్తి, నిక్కి

1 గంట క్రితం

deepti
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026, 12:08 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- తొలి టి20లో జింబాబ్వే మహిళలపై టీమిండియా విజయం

రాయ్‌పూర్‌: జింబాబ్వే మహిళలతో జరిగిన తొలి టీ20లో టీమిండియా బౌలర్లు సమిష్టిగా చెలరేగారు. నిప్పులు చెరిగే బంతులు విసిరి పర్యాటక జింబాబ్వే జట్టును 114పరుగులకే పరిమితం చేశారు. కానీ స్వల్ప ఛేదనలో తొలుత తడబడినా.. దీప్తి శర్మ, నిక్కి ప్రసాద్‌ క్రీజ్‌లో కుదురుకొని టీమిండియాకు గెలుపు తీరాలకు చేర్చారు. 19 పరుగులకే 4వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది. కెప్టెన్‌ మంధాన(9), షెఫాలీ(4), అనుష్క(4), హర్మన్‌(1) స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. జింబాబ్వే బౌలర్‌ గ్వాంజురా పవర్‌ ప్లే-లోనే వీరందరినీ ఔట్‌ చేసి టీమిండియాను కష్టాల్లో నెట్టింది. ఆ దశలో ఆల్‌రౌండర్లు నిక్కి ప్రసాద్‌(39నాటౌట్‌; 35బంతుల్లో 6ఫోర్లు), దీప్తి శర్మ(49; 37బంతుల్లో 8ఫోర్లు) స్ఫూర్తి దాయక ఇన్నింగ్స్‌తో ఆదుకున్నారు. ఈ క్రమంలో దీప్తి శర్మ అర్ధసెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఔటైంది. ఆ తర్వాత రీచా ఘోష్‌(7) స్వల్ప స్కోర్‌కే ఔటైనా.. అరుంధతి రెడ్డి(2) సాయంతో నిక్కి ప్రసాద్‌ మ్యాచ్‌ను ముగించింది. దీంతో టీమిండియా 15.4ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసి విజయం సాధించింది. జింబాబ్వే బౌలర్‌ గ్వాంజురా(3/18) బౌలింగ్‌లో సంచలనం నమోదు చేయగా... ఛారే, బిజాకు ఒక్కో వికెట్‌ పడగొట్టారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దీప్తి శర్మకు లభించింది. దీంతో మూడు టి20ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యతలో నిలువగా.. రెండో, టి20 ఆదివారం జరగనుంది. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వేను టీమిండియా బౌలర్లు కట్టడి చేశారు. క్రాంతి గౌడ్‌.. జింబాబ్వే ఓపెనర్‌ బిలవ్‌డ్‌ బిజాను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని డకౌట్‌గా వెనక్కి పంపింది. మరో ఓపెనర్‌ కెలిస్‌ ఎంధ్లోవు (42) పోరాడే ప్రయత్నం చేయగా.. అరుంధతి రెడ్డి బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యింది. షేర్న్‌ మేయర్స్‌ 43 పరుగులతో అజేయంగా నిలిచింది. ఇక నయాశా గ్వన్‌జురా (9), మిచెల్లి మవుంగ (0) పూర్తిగా విఫలం కాగా.. చిపో ముగెరి టిరిపానో (1) అజేయంగా నిలిచింది. భారత బౌలర్లలో నందిని శర్మకు రెండు, శ్రీచరణి, అరుంధతి రెడ్డికి ఒక్కో వికెట్‌ దక్కాయి.

స్కోర్‌బోర్డు...

జింబాబ్వే మహిళల ఇన్నింగ్స్‌: కెల్లిస్‌ (బి)అరుంధతి రెడ్డి 42, బెలోవిడ్‌ బిజా (ఎల్‌బి)క్రాంతి గాడ్‌ 0, మొడెస్టర్‌ (సి అండ్‌ బి)శ్రీచరణి 16, షర్నే మయర్స్‌ (నాటౌట్‌) 43, గ్వాంజురా (స్టంప్‌)రీచా (బి)నందిని శర్మ 9, మవుంగా (స్టంప్‌)రీచా (బి)నందిని శర్మ 0, తిరిపానో (నాటౌట్‌) 1, అదనం 3. (20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి) 114 పరుగులు. వికెట్ల పతనం: 1/7, 2/60, 3/82, 4/113, 5/113. బౌలింగ్‌: క్రాంతి 2-0-16-1, నందిని 4-0-11-2, షెఫాలీ 3-0-20-0, దీప్తి 4-0-22-0, అరుంధతి 3-0-30-1, శ్రీచరణి 4-0-14-1.

ఇండియా మహిళల ఇన్నింగ్స్‌: మంధాన (సి)మకూషా (బి)గ్వాంజూరా 9, షెఫాలీ వర్మ (సి అండ్‌ బి)గ్వాంజూరా 4, అనుష్కా శర్మ (సి)కెల్స్‌ (బి)గ్వాంజూరా 4, హర్మన్‌ప్రీత్‌ (సి)గ్వాంజూరా (బి)మవుంగా 1, నిక్కి ప్రసాద్‌ (నాటౌట్‌) 39, దీప్తి శర్మ (సి)మయర్స్‌ (బి)చారే 49, రీచా ఘోష్‌ (సి)గ్వాంజురా (బి)బిజా 7, అరుంధతి రెడ్డి (నాటౌట్‌) 2, అదనం 1, (15.4ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి) 116 పరుగులు. వికెట్ల పతనం: 1/14, 2/18, 3/19, 4/19, 5/101, 6/1 బౌలింగ్‌: మకూషా 1.4-0-19-0, గ్వాంజూరా 3-0-18-3, మవుంగా 3-1-19-1, ఛిపారే 1-0-10-0, ఛారే 3-0-23-1, బిజా 4-0-27-1.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్