తెలుగు స్వాగ్ వాలీబాల్ టోర్నీ విజయవంతం
ప్రజాశక్తి-విజయవాడ : తెలుగు రాష్ర్టాల్లో ప్రతిభావంతులైన వాలీబాల్ క్రీడాకారులను ప్రోత్సహించి, అవకాశాలు కల్పించటమే లక్ష్యమని తెలుగు బ్లాక్‌హాక్స్ సహా యజమాని కంకణాల అభిషేక్ రెడ్డి తెలిపారు. కంకణాల స్పోర్ట్స్ గ్రూప్ ఆధ్వర్యంలో వీఆర్ సిద్దార్థ యూనివర్శిటీలో నిర్వహించిన తెలుగు స్వాగ్ ట్రోఫీలో తెలుగు బ్లాక్‌హాక్స్ 5-0తో బ్లాక్‌హాక్స్ అకాడమీపై గెలుపొందింది. 25-11, 25-14, 25-9, 15-5, 16-14తో ఐదు సెట్లలోనూ తెలుగు బ్లాక్‌హాక్స్ మెప్పించింది. శాప్ ఎండీ ఎస్ భరణి ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై విజేత జట్టుకు ట్రోఫీని బహూకరించారు.







కామెంట్‌లు (0)