సోమవారం, 05 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆసియా క్రీడలు విజయవంతమే.. కానీ....

1 గంట క్రితం

japan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026, 07:42 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

నగోయా : కరోనా మహమ్మారి కఠిన సమయంలో టోక్యో ఒలింపిక్స్‌‌ను గొప్పగా నిర్వహించిన ఘనత జపాన్‌ ‌సొంతం. కానీ, 2026 ఆసియా క్రీడల ఆతిథ్యం జపాన్‌ ‌ట్రాక్‌ ‌రికార్డును దెబ్బతీసిందనే చెప్పాలి. ఖర్చు తగ్గించుకునేందుకు ‌గేమ్స్‌ విలేజ్‌‌ను నిర్మించకుండా.. 15 వేల మంది క్రీడాకారులు, అధికారులకు హోటల్స్‌, చెక్కతో చేసిన కంటెయినర్లు, క్రూయిజ్‌ ‌నౌకల్లో వసతి ఏర్పాటు చేసిన నిర్వాహకులు.. సమన్వయంతో పని చేయలేకపోయారు. భారత్‌‌తో సహా అధిక శాతం దేశాల క్రీడాకారులు సరైన సమయంలో రూమ్స్‌ ‌కేటాయింపు కోసం ఇబ్బందులు పడ్డారు. లాజిస్టికల్‌ ‌సమస్యలు సైతం ఎక్కువగానే కనిపించాయి. సమాచార లోపంతో ఓ స్టేడియంకు వెళ్లాల్సిన క్రీడాకారుల బస్సు మరో స్టేడియానికి వెళ్లాయి. దీంతో పలు ఆటల పోటీల షెడ్యూల్‌ ‌మార్చాల్సి వచ్చింది. మెడల్‌ ‌పోడియంపై దక్షిణ కొరియా జాతీయ గీతం బదులుగా ఉత్తర కొరియా జాతీయ గీతం వినిపించటం అందరినీ ఇరకాటంలోకి నెట్టింది. ఫుట్‌‌బాల్‌‌లో దక్షిణకొరియాపై జపాన్‌ గెలుపొందగా.. పతకాల ప్రదాన వేడుకలో ఆ దేశ జాతీయ గీతం వినిపించలేదు. ఆసియా క్రీడలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అక్కడి ప్రజలు ఆసక్తి చూపించలేదు. అత్యధిక శాతం స్టేడియాలు ఖాళీగా దర్శనమిచ్చాయి. జపాన్‌, దక్షిణ కొరియా ఫుట్‌‌బాల్‌ ‌మ్యాచ్‌ ‌ఫైనల్‌‌కు వెయ్యి మంది అభిమానులు సైతం స్టేడియానికి రాలేదు.


​కుంకుమ్‌ సరికొత్త రికార్డు

ఆసియా క్రీడలలో రికర్వ్ విలువిద్యలో వ్యక్తిగత స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయురాలిగా కుంకుమ్ కొత్త రికార్డు నెలకొల్పింది. ఆర్చరీలో 9 పతకాలు రాగా, ఇందులో ఐదు స్వర్ణాలు ఉన్నాయి. ఎక్కువ స్వర్ణాలు గెలిచిన వాటిలో ఆర్చరీ బృందం ముందుంది. భారత్‌, పాకిస్థాన్‌ మధ్య జరిగిన క్రికెట్‌ మ్యాచ్‌, హాకీ సెమీ ఫైనల్‌కు రికార్డుస్థాయి వ్యూస్‌ లభించాయని ఒసిఎ కో ఆర్డినేషన్‌ కమిటీ అధ్యక్ష‍ుడు తయ్యబ్‌ ఇక్రమ్‌ తెలిపారు.


​ప్రపంచం దృష్టిని ఆకర్షించిన 13 ఏళ్ల చైనా స్విమ్మర్‌

13 ఏళ్ల చైనా స్విమ్మర్‌ ‌ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. యు జిడి ఏకంగా మూడు పసిడి పతకాలు కొల్లగొట్టింది. ఆసియా క్రీడల ఈత కొలనులో పసిడి మోతతో 2028 లాస్‌ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌ ఈత కొలనులో అలజడికి తెరలేపింది. ఆసియా క్రీడల్లో మోస్ట్‌ ‌వాల్యూవబుల్‌ ‌ప్లేయర్‌‌గా నిలిచిన యు జిడి.. ప్రపంచ స్విమ్మింగ్‌‌లో సరికొత్త సంచలనంగా మారనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్