- పొంచివున్న వర్షం ముప్పు
- ఉ.9.30గం.ల నుంచి
టోక్యో: ఆసియా క్రీడల్లో పాల్గొనడానికి ముందు భారత పురుషుల క్రికెట్ జట్టు జపాన్‌తో ఏకైక టీ20లో ఆడనుంది. సానో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మంగళవారం జరిగే ఈ టీ20లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు బరిలోకి దిగుతోంది. భారత్-జపాన్ దేశాల మధ్య 75 ఏళ్ల మైత్రీ, దౌత్య సంబంధాలకు గుర్తుగా ఈ ప్రత్యేక మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ చారిత్రాత్మక పోరుకు 'సుజుకి కప్' అని నామకరణం చేశారు. ఈ మ్యాచ్ ఉదయం 9.30గం.లకు ప్రారంభం కానుంది. ఏకైక టి20 ముగిసిన తర్వాత టీమిండియా ఆసియా క్రీడల్లో తొలి మ్యాచ్‌ను 27న క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్ ఆడ నుంది. ఇదే జట్టు ఆసియా క్రీడల క్రికెట్‌లోనూ ప్రాతినిధ్యం వహించనుంది. అయితే ఈ ముఖ్యమైన మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు సానో మైదానంలో ప్రాక్టీస్ చేసే అవకాశం దక్కలేదు. షెడ్యూల్ ప్రకారం సోమవారం సాయంత్రం జరగాల్సిన ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొనాల్సి ఉంది. కానీ ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా ఔట్‌ఫీల్డ్ పూర్తిగా చిత్తడిగా మారింది. ఈ పరిస్థితుల దృష్ట్యా టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌ను రద్దు చేసుకున్నట్లు 'రెవ్‌స్పోర్ట్జ్' జర్నలిస్ట్ రోహిత్ జుగ్లాన్ ఎక్స్ వేదికగా వేదికగా వెల్లడించారు.
భారతజట్టు: శ్రేయస్(కెప్టెన్), సంజు శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ వర్మ, తిలక్ వర్మ, దూబే, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, బుమ్రా, ఆర్స్‌దీప్, సుందర్, విప్‌రాజ్ నిగమ్, సూర్యవంశీ.








కామెంట్‌లు (0)