బుధవారం, 09 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సెమీస్‌‌కు టఫీ, షెల్టన్‌

1 గంట క్రితం

shatlo
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 11:47 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

‌క్వార్టర్స్‌‌లో ఓడిన అల్కరాజ్

- యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌

న్యూయార్క్‌: యుఎస్‌ గ్రాండ్ స్లామ్ టోర్నీ-2026 సంచలన ఫలితం నమోదైంది. డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్‌ను ఐదుసెట్ల హోరాహోరీ పోరులో అమెరికా ఆటగాడు షెల్టన్‌ ఓడించాడు. సుమారు నాలుగున్నర గంటలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో షెల్టన్ 6-7, 6-1, 6-3, 1-6, 7-6(10/7) తేడాతో అల్కరాజ్‌ను చిత్తు చేశాడు. క్వార్టర్ ఫైనల్లో తొలి సెట్‌లోనే తృటిలో ఓటమిని తప్పించుకున్నాడు. 7-6(7/5) తేడాతో తొలి సెట్‌లో గట్టెక్కాడు. కానీ ఆ తర్వాత వరుసగా రెండు సెట్లను కోల్పోయాడు. నాలుగో సెట్‌ను గెలుచుకున్న అల్కరాజ్ మళ్లీ రేసులో నిలిచాడు. ఐదో సెట్‌లోనూ అతనికి కఠిన సవాల్ తప్పలేదు. చివరి వరకు పోరాడినా.. అల్కరాజ్‌కు ఓటమే ఎదురైంది. ఈ విజయంతో షెల్టన్ సెమీస్‌లో టఫీను ఢీకొట్టనున్నాడు. ఫిట్‌నెస్ సమస్యలతో యానిక్ సినర్ యూఎస్ ఓపెన్ 2026 టోర్నీకి దూరంగా ఉండగా.. దిగ్గజ ఆటగాడు నొవాక్ జకోవిచ్ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. తాజాగా అల్కరాజ్ కూడా నిష్క్రమించడంతో.. జ్వెరెవ్, టఫీ రేసులో నిలిచారు. ఇద్దరు అమెరికన్ల మధ్య జరిగిన మరో క్వార్టర్‌ ‌ఫైనల్లో 11వ సీడ్‌ ‌టఫీ అన్‌‌సీడెడ్‌ ‌మైకెల్సన్‌‌పై ఐదుసెట్ల హోరాహోరీ పోరులో విజయం సాధించాడు. ఉత్కంటభరితంగా సాగిన ఈ మ్యాచ్‌‌లో టఫీ 5-7, 3-6, 7-5, 6-3, 7-6(10-6)తో మైకెన్సన్‌‌ను చిత్తుచేసి సెమీస్‌‌కు చేరాడు. సెమీస్‌‌లో టఫీ.. తన దేశానికే చెందిన షెల్టన్‌‌తో తలపడనున్నాడు.

సెమీఫైనల్‌కు పెగులా

మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్, అమెరికా ప్లేయర్ జెస్సికా పెగులా 3-6, 6-4, 6-3 తేడాతో అమెరికాకే చెందిన ఎమ్మా నవ్వార్రోను ఓడించింది. 2 గంటల 20 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో పెగులా తొలి సెట్‌ను కోల్పోయింది. ఎమ్మా నవ్వార్రో చురుకైన ఆటతీరుతో పెగులా సర్వీస్‌ను బ్రేక్ చేసి 6-3తో సెట్ గెలుచుకుంది. రెండో సెట్‌లో హోరాహోరీగా తలపడ్డారు. 4-4 వద్ద నవ్వార్రో చేసిన డబుల్ ఫాల్ట్‌ను అనుకూలంగా మార్చుకుని పెగులా సెట్‌ను 6-4తో కైవసం చేసుకుంది. కీలకమైన ఆఖరి సెట్‌లో పెగులా తన అనుభవాన్ని ఉపయోగిస్తూ వరుస పాయింట్లు సాధించి 6-3తో సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచింది. దాంతో జెస్సికా పెగులా యుఎస్ ఓపెన్‌లో వరుసగా మూడోసారి సెమీఫైనల్ చేరుకుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్