- రాణించిన దేవదత్, జురెల్, పంత్
- భారత్ తొలి ఇన్నింగ్స్ 460/9
గాలే : శ్రీలంకతో గాలె టెస్టు రెండో రోజు వరుణుడు అంతరాయం కలిగించిన రెండో రోజు ఆటలో శ్రీలంక మాయ చేసినా.. టీమ్ ఇండియాదే పైచేయిగా నిలిచింది. దేవదత్ పడిక్కల్ (167) భారీ స్కోరుతో కదం తొక్కగా కెఎల్ రాహుల్ (82), ధ్రువ్ జురెల్ (51) అర్థ సెంచరీలతో రాణించారు. శ్రీలంక స్పిన్నర్లు కేశర నువాంత, ప్రభాత్ జయసూర్యలు సంయుక్తంగా ఏడు వికెట్లతో మాయాజాలం చేశారు. అయినా, భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 460 పరుగుల భారీ స్కోరు చేసింది. నేడు టీమ్ ఇండియా ఓవర్‌నైట్ డిక్లరేషన్ ఇస్తుందా? లేదంటే ఆఖరు వికెట్ పడే వరకు పరుగుల వేట సాగిస్తుందా? చూడాలి.
వర్షంతో సగానికి పైగా ఆట తుడిచిపెట్టుకుపోయినా, గాలె టెస్టులో టీమ్ ఇండియా పైచేయి సాధించింది. 116 ఓవర్లలో 9 వికెట్లకు తొలి ఇన్నింగ్స్‌లో 460 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. నం.3 బ్యాటర్, తొలి రోజు సెంచరీ వీరుడు దేవదత్ పడిక్కల్ (167, 230 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్) భారీ సెంచరీతో చెలరేగాడు. ఓపెనర్ కెఎల్ రాహుల్ (82, 175 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్), ధ్రువ్ జురెల్ (51, 68 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీలతో రాణించారు. రిషబ్ పంత్ (39), యశస్వి జైస్వాల్ (32) సైతం మెరవటంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ మంచి స్కోరు ఖాయం చేసుకుంది. శ్రీలంక స్పిన్నర్లు కేశర నువాంత (3/175), ప్రభాత్ జయసూర్య (4/109) మాయాజాలం ప్రదర్శించారు. ఓ వైపు వికెట్లు పడినా, భారత్ వేగంగా పరుగులు రాబట్టింది. రెండో రోజు 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడగా.. భారత్ 7 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది.
రాణించిన జురెల్ :
గాలెలో రెండో రోజు వర్షంతో మొదలైంది. నిలకడగా వర్షం కురవటంతో తొలి సెషన్లో ఆట సాధ్యపడలేదు. దీంతో ఒక్క బంతి పడకుండానే లంచ్ విరామం తీసుకున్నారు. లంచ్ తర్వాత సైతం వర్షం కురిసినా,కాస్త విరామం లభించింది. ఓవర్‌నైట్ బ్యాటర్లు రిషబ్ పంత్, దేవదత్ పడిక్కల్‌లు తొలి రోజు కొనసాగించలేదు. పంత్ నువాంత మాయకు వికెట్ కోల్పోవటంతో శ్రీలంక బౌలర్లు వేట మొదలెట్టారు. 77 పరుగుల వద్ద మోచేతి నొప్పితో రిటైర్డ్‌హర్ట్‌గా వెనక్కి వెళ్లిన కెఎల్ రాహుల్ క్రీజులోకి వచ్చినా.. ఎంతోసేపు వికెట్ నిలుపుకోలేదు. 14 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 215 బంతుల్లో 150 మార్క్ అందుకున్న పడిక్కల్ ఆ తర్వాత వికెట్ కోల్పోయాడు. దీంతో టీ విరామానికి భారత్ 5 వికెట్లకు 364 పరుగులు చేసింది. వర్షం కురిసినా స్పిన్నర్లు నువాంత, జయసూర్యలు మాయ చేయగలిగారు. మూడో సెషన్లో ధ్రువ్ జురెల్ (51) జోరు చూపించాడు. అర్థ సెంచరీతో మెరిసిన జురెల్ భారత్‌కు వేగంగా పరుగులు అందించాడు. రవీంద్ర జడేజా (13) నిరాశపరిచినా.. మానవ్ సుతార్ (24) మెరిశాడు. ఆఖరు సెషన్లో మరో నాలుగు వికెట్లు పడగొట్టిన శ్రీలంక రేసులోకి వచ్చినా.. అప్పటికే భారత్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు ఖాయం చేసుకుంది.
స్కోరు వివరాలు :
భారత్ తొలి ఇన్నింగ్స్ : యశస్వి జైస్వాల్ (రనౌట్) 32, రాహుల్ (సి) ఫెర్నాండో (బి) నువాంత 82, పడిక్కల్ (స్టంప్డ్) డిక్‌వెల్లా (బి) జయసూర్య 167, గిల్ (సి) లాహిరు (బి) జయసూర్య 16, పంత్ (సి) దినుశ (బి) నువాంత 39, జురెల్ (సి) డిసిల్వ (బి) జయసూర్య 51, జడేజా (ఎల్బీ) నువాంత 13, సుతార్ (సి) లాహిరు (బి) జయసూర్య 24, సిరాజ్ (సి) డిసిల్వ (బి) ఫెర్నాండో 11, కుల్‌దీప్ నాటౌట్ 12, ప్రసిద్ కృష్ణ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు : 12, మొత్తం : (116 ఓవర్లలో 9 వికెట్లకు) 460.
వికెట్ల పతనం : 1-47, 2-236, 3-307, 4-319, 5-357, 6-377, 7-432, 8-447, 9-447.
బౌలింగ్ : అసిత ఫెర్నాండో 17-1-61-1, లహిరు కుమార 13-1-1-76-0, కేశర నువాంత 39-1-175-3, జయసూర్య 39-6-10904, డిసిల్వ 4-0-15-0, దినుశ 4-0-17-0








కామెంట్‌లు (0)