సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అదరగొట్టిన యువ భారత్‌

1 గంట క్రితం

yash
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 11:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- అండర్‌-19 వన్డే క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై గెలుపు

- సిరీస్‌ కైవసం

రాజ్‌కోట్‌: ఆస్ట్రేలియా అండర్-19తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత అండర్-19 జట్టు మరో వన్డే మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. తొలి వన్డేలో 7 పరుగుల తేడాతో నెగ్గిన భారతజట్టు సోమవారం జరిగిన రెండో వన్డేలో ఏకంగా 103 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌ కు దిగిన యువ భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 341 పరుగుల భారీ స్కోరు చేసింది. యశ్‌బర్దన్ చౌహాన్(122)కి తోడు వీకే వినీత్ 87 పరుగులతో రాణించారు. మాజీ క్రికెటర్ సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్(47), కుషాగ్రా ఓజా(34) పర్వాలేదనిపించారు. బ్యాటుతో ఆకట్టుకున్న భారత అండర్-19 జట్టు బంతితోనూ మెరిసింది. చేజింగ్‌లో ఆసీస్‌ను 41.1 ఓవర్లలో 238 పరుగులకే ఆలౌట్‌ చేసింది. యశ్‌బర్దన్ చౌహాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేశాడు. సెంచరీ చేసిన అతను రెండు వికెట్లు పడగొట్టాడు. చిగురుపటి వెంకట 3 వికెట్లు, కావ్య పటేల్ 2 వికెట్లు తీసి ప్రత్యర్ధి జట్టును దెబ్బకొట్టాడు. ఆసీస్ అండర్‌-19 జట్టులో జాక్ జోస్నెక్(81), బ్లేక్ క్యాటిల్(44), మాత్యూ లాఫ్(42), హోలిక్(33) పోరాడినప్పటికీ తమ టీమ్‌ను గెలిపించలేకపోయారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ యశ్‌బర్దన్‌కు లభించింది. చివరి, మూడో వన్డే బుధవారం జరగనుంది. వన్డే సిరీస్‌ తర్వాత ఇరుజట్ల మధ్య రెండు అనధికారిక టెస్ట్‌ సిరీస్‌ జరగనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్