చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)-2027 సీజన్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. హెడ్ కోచ్‌గా టీమిండియా ఎడమచేతి మాజీ పేసర్ జహీర్ ఖాన్‌ను ఎంపిక చేసినట్లు సోమవారం ప్రకటించింది. రాబోయే ఐపీఎల్ 2027 సీజన్ కోసం జహీర్ ఖాన్ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు జట్టు యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇంతకుముందు ఈ జట్టుకు కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్ హెడ్‌కోచ్‌గా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన స్థానంలో జహీర్‌ను ఎంపిక చేశారు. ఇప్పటివరకు 16 ఐపీఎల్ టోర్నీలలో పాల్గొన్న సీఎస్‌కే.. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఇటీవలికాలంలో సీఎస్‌కే అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతోంది. చివరిసారిగా 2023లో ధోని నాయకత్వంలోనే ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 2026 సీజన్‌లో ఆడిన 14 మ్యాచుల్లో ఆరు మ్యాచుల్లో గెలిచి ఎనిమిదో స్థానంలో నిలిచింది.
చెన్నై సూపర్ కింగ్స్ హెడ్‌కోచ్‌గా జహీర్ ఖాన్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 11:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)