గురువారం, 10 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సెమీస్‌‌కు జ్వెరేవ్‌, ఖచనోవ్‌

27 నిమిషాల క్రితం

us
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 11:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- టాప్‌-4 ర్యాంకర్ల మధ్య నేడు ‌మహిళల సింగిల్స్‌ ‌సెమీస్‌

న్యూయార్క్‌: యుఎస్‌ ఓపెన్‌ ‌పురుషుల సింగిల్స్‌ ‌సెమీఫైనల్లోకి టాప్‌ ‌సీడ్‌, జర్మనీకి చెందిన అలెగ్జాండర్‌ ‌జ్వెరేవ్‌, రష్యాకు చెందిన అన్‌‌సీడెడ్‌ ‌క్రీడాకారుడు కరెన్‌ ‌ఖచనోవ్‌ ‌ప్రవేశించారు. గురువారం జరిగిన క్వార్టర్‌ ‌ఫైనల్లో వీరిద్దరూ వరుససెట్లలో ప్రత్యర్ధులపై సునాయాసంగా విజయం సాధించారు. ఆర్దర్‌ ‌యాష్‌ ‌స్టేడియంలో జరిగిన క్వార్టర్‌ ‌ఫైనల్లో జ్వెరేవ్‌ 6-2, 7-5, 6-1తో బి.వాన్‌ ‌డీ జాండుస్కూల్ఛ్ ను చిత్తుచేయగా.. మరో క్వార్టర్‌ ‌ఫైనల్లో ఖచనోవ్‌ 6-2, 7-5, 3-2తో ఆధిక్యతలో ఉన్న దశలో 28వ ర్యాంకర్‌, జర్మనీకి చెందిన బ్లాక్స్‌ ‌టోర్నీనుంచి నిష్ర్కమించాడు.

​కోకో గాఫ్‌తో రైబకినా ఢీ..

శుక్రవారం జరిగే మహిళల సింగిల్స్‌‌లో 4వ సీడ్‌, అమెరికా సంచలనం కోకో గాఫ్‌‌తో కజకిస్తాన్‌‌కు చెందిన 2వ సీడ్‌ ‌రైబకినా తలపడనుంది. బుధవారం జరిగిన క్వార్టర్‌ ‌ఫైనల్లో కోకో గాఫ్‌ 2-6, 7-6(9-7), 6-2తో 5వ సీడ్‌, రష్యాకు చెందిన ఆండ్రీవాను చిత్తుచేసింది. సెమీస్‌‌కు చేరే క్రమంలో ఆండ్రీవా నుంచి రెండు మ్యాచ్‌ ‌పాయింట్లు కాచుకొని మరీ విజయం సాధించడం విశేషం. మరో క్వార్టర్‌ ‌ఫైనల్లో 2వ సీడ్‌ ‌రైబకినా 3-6, 6-1, 6-4తో అన్‌‌సీడెడ్‌ క్యూ జెంగ్‌(‌చైనా)ను ఓడించింది. ఇతర పోటీల్లో 3వ సీడ్‌ అమెరికాకు చెందిన పుగూలా 3-6, 6-4, 6-3తో సహచర క్రీడాకారిణి నవార్రోను, టాప్‌‌సీడ్‌ ‌సబలెంక(బెలారస్‌ 7-6(7-1), 3-6, 7-6(10-7)తో 6వ సీడ్‌ ‌నోస్కోవాను చిత్తుచేసి సెమీస్‌‌కు చేరిన సంగతి తెలిసిందే. 2026 యుఎస్‌ ఓపెన్‌ ‌మహిళల గ్రాండ్‌‌స్లామ్‌ సెమీఫైనల్‌‌కు టాప్‌-4 ‌క్రీడాకారిణులు చేరడం మరో విశేషం. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో టాప్‌‌సీడ్‌‌తో 3వ ర్యాంకర్‌, 2వ ర్యాంకర్‌‌తో 4వ ర్యాంకర్‌ ‌తలపడనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్