ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో వర్జీనియా పొగాకు రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని, వెంటనే జోక్యం చేసుకుని రైతులను ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఆయన బుధవారం లేఖ రాశారు. 2025-26 సీజన్‌లో పొగాకు కొనుగోలు కంపెనీలు సిండికేట్‌గా మారి ధరలను కృత్రిమంగా తగ్గిస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, పొగాకు బోర్డు అలసత్వం వల్ల రైతులు రూ.వేల కోట్లను నష్టాలను చవిచూస్తున్నారని వెల్లడించారు. ఏలూరు ప్రాంతంలో మొదటి గ్రేడ్ వర్జీనియా పొగాకుకు కిలో రూ.265, లో గ్రేడ్‌కు రూ.205 మాత్రమే ధర లభిస్తోందని తెలిపారు. అలాగే ప్రకాశం, నెల్లూరు, మార్కాపురం ప్రాంతాల్లో మొదటి గ్రేడ్ పొగాకుకు రూ.250, లో గ్రేడ్‌కు రూ.190 వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో సుమారు 44 వేల మంది రైతులు 48 వేల బారన్‌లు కలిగి ఉన్నారని తెలిపారు. వారిలో 90 శాతం మంది చిన్న, సన్నకారు రైతులేనని తెలిపారు. అయితే వేలం కేంద్రాల్లో నాణ్యమైన పొగాకును కూడా తిరస్కరిస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. ఒంగోలు, టంగుటూరు, కొండేపి, వెల్లంపల్లి కేంద్రాల్లో 47 శాతం వరకు బేళ్లు తిరస్కరిస్తుండగా, ఇతర ప్రాంతాల్లో 40 శాతం వరకు తిరస్కరణలు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. తిరస్కరించిన పొగాకును మళ్లీ బారన్‌లకు తరలించేందుకు రైతులకు అదనపు భారం పడుతోందన్నారు.
పొగాకు రైతులను ఆదుకోవాలి
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 17, 2026, 09:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)