గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌

2 రోజుల క్రితం

డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 07, 2026, 09:14 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలంగాణ : తెలంగాణ పోలీస్ శాఖలో సంచలనంగా మారిన డీఎస్‌పీ భీమ్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్‌లోని పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న సంకిరెడ్డి భీమ్‌రెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం సాయంత్రం అధికారికంగా అరెస్ట్ చేశారు. ఐదు రోజుల క్రితం భీమ్‌రెడ్డి ఇల్లు, కార్యాలయాలతో పాటు ఆయన బంధువులు, బినామీలకు చెందిన 16 ప్రాంతాల్లో ఎసిబి బృందాలు ఏకకాలంలో జరిపిన మెరుపు సోదాల అనంతరం ఈ అరెస్ట్ చోటుచేసుకుంది. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు జడ్జి ముందు హాజరు పరిచారు. దీంతో అతనికి 14 రోజుల రిమాండ్ విధించగా ఎసిబి అధికారులు భీమ్ రెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే పూర్తి స్థాయి విచారణ కోసం ఎసిబి అధికారులు ఆయనను కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్