ప్రజాశక్తి - నందికొట్కూరు : శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తున్న వరద ప్రవాహాల నేపథ్యంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తెలుగు గంగ కాల్వకు నీటి విడుదల ప్రారంభమైంది. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి తెలుగు గంగ కాల్వకు రెండు వేల క్యూసెక్కుల నీటిని గురువారం అధికారులు విడుదల చేశారు. తెలుగు గంగ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ శివశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు గేట్లు ఎత్తి తెలుగు గంగ కాల్వ ద్వారా వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు రెండు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
Print Editionపోతిరెడ్డిపాడు నుంచి రెండు వేల క్యూసెక్కులు విడుదల
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 06, 2026, 11:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)