ప్రజాశక్తి - సామర్లకోట : ‘అర్నబ్’ తుపాను ప్రభావంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. తుపాను ఉధృతి కారణంగా సామర్లకోట జంక్షన్ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేసినట్లు స్టేషన్ మేనేజర్ ఎం.రమేష్ మంగళవారం తెలిపారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సామర్లకోట రైల్వే జంక్షన్‌లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ సేవలను అందుబాటులోకి తెచ్చారు.
ఈ సందర్భంగా స్టేషన్ మేనేజర్ రమేష్ మాట్లాడుతూ తుపాను తీవ్రత దృష్ట్యా మంగళ, బుధవారాల్లో ప్రయాణించాల్సిన అధిక సంఖ్యలో రైళ్లను రద్దు చేయడంతో పాటు, మరికొన్ని రైళ్లను రీ-షెడ్యూల్ చేసినట్లు వివరించారు. రైళ్ల రద్దు, మార్పులపై ప్రయాణికులకు ఎప్పటికప్పుడు స్పష్టమైన సమాచారం అందించి అప్రమత్తం చేసేందుకే ఈ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సామర్లకోట ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపై ఈ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు, ఇప్పటికే ముందస్తు రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. రానున్న రెండు రోజుల పాటు 24 గంటల వెంబడి ఈ హెల్ప్ డెస్క్ సేవలు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయని స్టేషన్ మేనేజర్ రమేష్ స్పష్టం చేశారు.
సామర్లకోట రైల్వే స్టేషన్ లో హెల్ప్ డెస్క్ నిర్వహిస్తున్న దృశ్యం








కామెంట్‌లు (0)