కోటవురట్ల (అనకాపల్లి) : అనకాపల్లి జిల్లా కోటవురట్ల కెజిబివి (కస్తూర్బా పాఠశాల) లో కలుషిత ఆహారం తీసుకున్న 30 మంది విద్యార్థినులు శనివారం అస్వస్థతకు గురయ్యారు. వీరిలో తీవ్ర అస్వస్థతకు గురైన ఐదుగురిని స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన విద్యార్థినులకు ORS ప్యాకెట్లు, యాంటీబయాటిక్ టాబ్లెట్లు అందించినట్లు డాక్టర్ సంతోష్ కుమార్ తెలిపారు. విద్యార్థినులకు విరేచనాలు కావడంతో వెంటనే వైద్య సేవలు అందించామని చెప్పారు. విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యాధికారులు తెలియజేశారు. నిన్న పాఠశాలలో మెగా పేరెంటు-టీచర్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మధ్యాహ్నం మిగిలిన వంటకాలను విద్యార్థులకు రాత్రి భోజనంలో కూడా పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆహారం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురై ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
కస్తూర్బా పాఠశాలలో 30 మంది విద్యార్థినులకు అస్వస్థత
8 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 25, 2026, 05:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)