- రెండో టి20లో జింబాబ్వేపై 90 పరుగుల తేడాతో గెలుపు
- సిరీస్ 2-0తో కైవసం
హరారే: రెండో టి20లో టీమిండియా సమిష్టిగా రాణించడంతో సిరీస్ కైవసం చేసుకుంది. తొలి టి20లో 7వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారతజట్టు.. శనివారం జరిగిన రెండో టి20లో 90 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తుచేసింది. హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో శనివారం జరిగిన రెండో టి20లో టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 219పరుగుల భారీస్కోర్ నమోదు చేసింది. భారీ ఛేదనలో టీమిండియా బౌలర్లు సమిష్టిగా రాణించడంతో జింబాబ్వే 17.5 ఓవర్లలో129పరుగులకే కుప్పకూలింది. దీంతో 3 టి20ల సిరీస్‌ను భారతజట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది.
తొలుత విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ(8) తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు కొట్టి ఆశలు రేపినా.. ముజరబాని అతనిని పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో మెరిసిన వైభవ్ సూర్యవంశీ(20) కూడా ధాటిగా ఆడే క్రమంలో వికెట్ సమర్పించుకున్నాడు. 29 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియాను.. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(25), ఇషాన్ కిషన్(81) ఆదుకున్నారు. అయితే.. బెన్నెట్ ఓవర్లో అయ్యర్ ఔటవ్వడంతో 95 వద్ద మూడో వికెట్ పడింది. అనంతరం ఇషాన్, వైస్ కెప్టెన్ తిలక్ వర్మ(60 నాటౌట్)లు ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్నారు. ధనాధన్ ఆడిన ఈ ద్వయం జింబాబ్వే బౌలింగ్ దళాన్ని దీటుగా ఎదుర్కొంది. ఈ ఫార్మాట్‌లో 12వ అర్ధ శతకం తర్వాత ఇషాన్ ఔటైనా.. తిలక్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అతడు 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకోగా రింకూ సింగ్(12) విఫలమయ్యాడు. ఇషాన్, తిలక్ విధ్వంసంతో నిర్ణీత ఓవర్లలో టీమిండియా 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. . జింబాబ్వే బౌలర్లలో ముజరబని, నగవరా, ఎవాన్స్, న్యూమన్, బెన్నెట్‌లు తలా ఒక వికెట్ తీశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇషాన్ కిషన్‌కు లభించగా.. మూడో, చివరి టి20 ఆదివారం జరగనుంది.
స్కోర్‌బోర్డు...
ఇండియా ఇన్నింగ్స్ : సూర్యవంశీ (సి)ముజరబ్బాని (బి)నరవా 20, అభిషేక్ శర్మ (సి)రియాన్ బురి (బి)ముజరబ్బాని 8, ఇషాన్ కిషన్ (సి)బెన్నెట్ (బి)న్యాంహూరి 81, శ్రేయస్ అయ్యర్ (సి)ఎవాన్స్ (బి)బెన్నెట్ 25, తిలక్ వర్మ (నాటౌట్) 60, రింకు సింగ్ (సి)రియాన్ బురి (బి)బ్రాడ్ ఎవాన్స్ 12, దూబే (నాటౌట్) 6, అదనం 7. (20ఓవర్లలో 5వికెట్ల నష్టానికి) 219పరుగులు.
వికెట్ల పతనం: 1/10, 2/29, 3/95, 4/189, 5/213
బౌలింగ్: సికిందర్ రాజా 4-0-47-0, ముజరబ్బాని 4-0-36-1, నరవా 3-0-43-1, ఎవాన్స్ 4-0-44-1, న్యాంహూరి 3-0-25-1, బెన్నెట్ 2-0-22-1.
జింబాబ్వే ఇన్నింగ్స్: బెన్నెట్ (సి)ఇషాన్ కిషన్ (బి)యశ్ ఠాకూర్ 32, బెన్ కర్రన్ (సి)దూబే (బి)ప్రిన్స్ యాదవ్ 1, మయర్స్ (బి)బిష్ణోయ్ 12, రియాన్ బూరి (సి)రింకు సింగ్ (బి)తిలక్ వర్మ 20, సికిందర్ రాజా (సి)ఇషాన్ కిషన్ (బి)ప్రిన్స్ యాదవ్ 0, మధెవెరె (సి)శ్రేయస్ (బి)దూబే 2, మరుమణి (బి)యశ్ ఠాకూర్ 24, ఎవాన్స్ (బి)అభిషేక్ శర్మ 19, న్యాంహూరి (బి)అభిషేక్ శర్మ 3, నరవా (సి)రింకు (బి)అభిషేక్ శర్మ 1, ముజరబ్బాని (నాటౌట్) 7, అదనం 8 (17.5ఓవర్లలో ఆలౌట్) 129పరుగులు.
వికెట్ల పతనం: 1/34, 2/34, 3/48, 4/49, 5/65, 6/82, 7/105, 8/119, 9/121, 10/129
బౌలింగ్: మయాంక్ యాదవ్ 3-0-25-0, యశ్ ఠాకూర్ 4-0-30-2, ప్రిన్ష్ యాదవ్ 1.2-0-10-2, బిష్ణోయ్ 4-0-20-1, దూబే 1.4-0-13-1, తిలక్ వర్మ 1-0-9-1, అభిషేక్ 2.5-0-17-3.







కామెంట్‌లు (0)