గురువారం, 15 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఇంటర్ పరీక్షలకు 32 పేజీల అన్సర్ షీట్

1 గంట క్రితం

ap inter.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026, 08:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణలో ఇంటర్మీడియట్ విద్యా మండలి కీలక మార్పులు చేసింది. వచ్చే ఏడాది మార్చిలో జరిగే పరీక్షల నుండి కొత్త విధానం అమల్లోకి రానుందని బోర్డు కార్యదర్శి పి రంజిత్ బాషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా తీసుకొచ్చిన మార్పుల్లో భాగంగా అన్ని జనరల్ థియరీ సబ్జెక్టులకు ఒకే రకమైన 32 పేజీల సమాధాన పత్రాన్ని ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఒకేషనల్ కోర్సులకు ప్రస్తుతం అమలు చేస్తున్న 24 పేజీల బుక్ లెట్ విధానమే కొనసాగుతుందని పేర్కొన్నారు. బయాలజీ పరీక్షలో ఇప్పటి వరకు బోటనీ, జువాలజీకి వేర్వేరు ఒఎంఆర్ షీట్లు ఇచ్చే విధానాన్ని తొలగించినట్లు తెలిపారు. ఇక నుండి ఒకే ఒఎంఆర్ షీట్ తో పాటు 40 పేజీల ఆన్సర్ బుక్ లెట్ అందిస్తామని వెల్లడించారు. వీటితో పాటు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, హిస్టరీ వంటి కోర్ సబ్జెక్టుల్లో ఎలక్టివ్ సబ్జెక్టులు ఉన్న విద్యార్థులకు వేర్వేరు ప్రశ్నాపత్రాలు అందించనునట్లు తెలిపారు. ఈ మార్పులను విద్యార్థులు, అధ్యాపకుల దృష్టికి తీసుకెళ్లాలని అన్ని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు బోర్డు సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్