గురువారం, 15 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి

1 గంట క్రితం

కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026, 09:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - తిరుమల : తిరుమల వేంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం ఉదయం మలయప్పస్వామివారు ఉభయదేవేరులను బకాసుర వధ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై ఊరేగించారు. గజరాజుల ముందు నడక, మంగళవాయిద్యాల నాదం, భజనలు, కోలాటాలు నడుమ వాహనసేవ సాగింది. పది రాష్ట్రాల నుంచి 16 కళాబృందాలు.. 412 మంది కళాకారులు తమ అద్భుత ప్రదర్శనలు చేశారు. దేశంలోని విభిన్న ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కళారూపాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్‌, చిన్నజీయర్‌, టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు, ఇఒ ముద్దాడ రవిచంద్ర, కలెక్టర్ వెంకటేశ్వర్, అదనపు ఇఒ సిహెచ్.వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు, జెఇఒ (విద్యా, ఆరోగ్యం) గోపీనాథ్, సివిఎస్‌ఒ మురళీకృష్ణ పాల్గొన్నారు.

​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్