బెంగళూరు : ఐటి విప్రో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 సెప్టెంబర్తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో రూ.3,200.6 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే లాభం 1.4 శాతం తగ్గగా.. కార్యకలాపాల ఆదాయం 9.1 శాతం పెరిగి రూ.24,752.7 కోట్లకు చేరింది. ఐటి సేవల విభాగం నిర్వహణ మార్జిన్ 16.5 శాతంగా నమోదైంది. పెద్ద డీల్స్ విలువ 58.6 శాతం తగ్గి 674 మిలియన్ డాలర్లకు పరిమితమైంది. ప్రస్తుత డిసెంబర్ త్రైమాసికంలో ఐటి సేవల ఆదాయ వృద్ధి -1.5 శాతం నుంచి 0.5 శాతం మధ్య ఉండవచ్చని కంపెనీ అంచనా వేసింది.
Print Editionవిప్రో నికర లాభం రూ.3,200 కోట్లు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 15, 2026, 09:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)