శుక్రవారం, 09 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

లారీ ఢీకొని 32 గొర్రెలు మృతి

5 రోజుల క్రితం

లారీ ఢీకొని 32 గొర్రెలు మృతి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026, 07:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - పలాస(శ్రీకాకుళం జిల్లా): లారీ ఢీకొని 32 గొర్రెలు మృతి చెందిన ఘటన శ్రీకాకుళం జిల్లా పలాసలో చోటుచేసుకుంది. పలాస శాసనం జాతీయ రహదారి సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి ఇచ్ఛాపురం నుంచి టెక్కలి వైపు వస్తున్న లారీ అతి వేగంతో గొర్రెలను ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాయి. మరో 24 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం... పలాస మండలంలోని అమలకుడియాకు చెందిన ముడిమించి పాపారావు, మోళియపుట్టి మండలం ముక్తాపురానికి చెందిన గుమ్మిడి హరికృష్ణ, జల్లిభద్రకు చెందిన పిల్ల సింహాచలం, పలాస మండలం కేసుపురానికి చెందిన సందక పాపారావు, సిద్ధభక్తుల సుదర్శన్, నందిగాం మండలం జడ్యడకు చెందిన రాపాక రమణయ్య తమ గొర్రెలను పలాస మండలం కైజోల కొండ ప్రాంతం నుంచి పలాస తీసుకొస్తున్నారు. ఈ తరుణంలో జాతీయ రహదారి సమీపం శాసనం గ్రామం వద్ద లారీ అతి వేగవంతంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో గొర్రెలు తుళ్లిపోయి కొద్దిదూరం ఎగిరి పడ్డాయి. 32 గొర్రెలు మృతి చెందాయి. పశుసంవర్థకశాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. సుమారు రూ.12 లక్షల వరకు నష్టం వాటిల్లిందని నిర్ధారించారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు.​

​

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్