శనివారం, 19 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

34 వేల అన్నప్రసాదం పొట్లాలు వృథా

6 గంటల క్రితం

food wast.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 08:46 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-తిరుమల : బ్రహ్మోత్సవాల సందర్భంగా అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని యాత్రికులకు నాలుగు మాడ వీధుల్లో అన్నప్రసాదం పొట్లాలను పంపిణీ చేయాలని టీటీడీ మఠాలను కోరింది. అయితే మఠాల నుంచి ఆలస్యంగా సేకరించిన అన్నప్రసాదం పొట్లాలను రెవెన్యూ, ఆరోగ్యశాఖ, వేంగమాంబ విభాగాలకు తరలించారు. ఆ పులిహోర, దద్దోజనం ప్యాకెట్లను యాత్రికులకు పంపిణీ చేయకుండా వైకుంఠం కాంప్లెక్స్‌లోని అన్నదానం తయారీ ప్రాంతంలో ఉన్న డస్ట్‌బిన్లలో పడేశారు. దీంతో సుమారు 34 వేల అన్నప్రసాదం పొట్లాలు వృథాగా మారి చెత్తకుప్పలో చేరాయి. యాత్రికుల కోసం సిద్ధం చేసిన భారీ మొత్తంలో అన్నప్రసాదాన్ని పంపిణీ చేయకుండా పడేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్