ప్రజాశక్తి - శృంగవరపుకోట : విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలోని తాటిపూడి వద్ద గల ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ బాలికల కళాశాలలో 52 మంది విద్యార్థినులు జ్వరాల బారిన పడ్డారు. ప్రిన్సిపల్ శారదాబాయి కొట్టాం... పిహెచ్‌సికి సమాచారం ఇవ్వడంతో డాక్టర్ జె.హారిక ఆధ్వర్యాన రెసిడెన్షియల్ కళాశాలలో వైద్య బృందం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. విద్యార్థులంతా ఒళ్లు నొప్పులు, జ్వరంతో బాధపడుతున్నారు. వీరిలో ఒక విద్యార్థినికి ఫిట్స్, ఆరుగురు విద్యార్థులకు తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు. వారిని ఎస్.కోట పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. డిసిఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ విద్యార్థినులను పరామర్శించారు. విద్యార్థులకు పూర్తిగా నయమయ్యే వరకు వైద్య శిబిరాన్ని కొనసాగించాలని, అత్యవసరమైతే మరిన్ని వైద్య బృందాలను రప్పించి సేవలందించాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపల్‌ను ఫోన్‌లో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆరాతీశారు. డిఇఒ యు.మాణిక్యం నాయుడు విద్యార్థినులను పరామర్శించారు.
Print Editionతాటిపూడి గురుకులంలో జ్వరం బారిన 52 మంది విద్యార్థినులు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 29, 2026, 09:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)