గురువారం, 30 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసోలార్‌ ప్రాజెక్టు శంకుస్థాపనకు హాజరుపై పునరాలోచించండి

1 రోజు క్రితం

aiks
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 10:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మంత్రి లోకేష్‌‌కు రైతు సంఘం విజ్ఞప్తి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం హోసూరులో టాటా సోలార్ ప్రాజెక్టు పనుల శంకుస్థాపనకు హాజరుకావడంపై పునరాలోచన చేయాలని మంత్రి లోకేష్‌‌కు ఆంధ్రప్రదేశ్‌ ‌రైతు సంఘం రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గ్రామానికి చెందిన రైతుల తరపున రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి కృష్ణయ్య, కె ప్రభాకర్‌ ‌రెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రామంలో 1,800 ఎకరాల్లో టాటా సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నారని, మొత్తం మూడు గ్రామాలకు సంబంధించిన 600 మంది రైతుల భూములను లీజు పద్ధతిలో టాటా సోలార్ కంపెనీ తీసుకున్నదని తెలిపారు. రైతులతో సోలార్ కంపెనీ కుదుర్చుకున్న దీర్ఘాకాలిక లీజు ఒప్పందంలో పేర్కొన్న షరతుల వల్ల వారు తీవ్రంగా నష్టపోతారన్నారు. సోలార్ కంపెనీ భూములిచ్చిన రైతులకు కౌలు చెల్లించే విషయంలో ఒక సూత్రబద్ధ విధానాన్ని అనుసరించలేదని పేర్కొన్నారు.

రైతు సంఘం నాయకుల అరెస్టుకు ఖండన

ఎపి రైతు సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య, సహాయ కార్యదర్శి లక్కు ప్రసాద్‌, ఇతర నాయకులను గృహ నిర్బంధం చేయాడాన్ని సంఘం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. పొగాకుకు కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలన్నారు. రైతుల ఆందోళనను నీరుగార్చేందుకు ఈ చర్యకు పాల్పడ్డారని పేర్కొంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్