శ్రీకాకుళం : మాజీ స్పీకర్, వైసిపి నేత తమ్మినేని సీతారాం శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. ఫోర్జరీ పేరుతో అక్రమ రిజిస్ట్రేషన్ కేసుకు సంబంధించి .... తమ్మినేనిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. శ్రీకాకుళంలో సంచలనం సృష్టించిన రూ.4 కోట్ల విలువైన భూ కబ్జా కుట్ర కేసులో తమ్మినేని, ఆయన భార్య వాణి, కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్ నిందితులుగా ఉన్నారు. భూ యజమాని బతికి ఉండగానే .... నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలను సృష్టించి కోట్ల రూపాయల విలువైన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తామే ఏకైక వారసురాలంటూ ఒడిశాకు చెందిన ఓ మహిళను తెరపైకి తెచ్చి చేసిన భూ కబ్జా కుట్రలో తమ్మినేని కుటుంబం పాత్రను పోలీసులు బట్టబయలు చేశారు. అప్పటి వరకు ఆమదాలవలసలోని అద్దె ఇంట్లో ఉన్న తమ్మినేని కుటుంబమంతా ఇంట్లో రెండు సొంత కార్లు ఉన్నప్పటికీ ప్రైవేటుగా ఓ ఇన్నోవా కారును రప్పించి అందులో పరారయ్యారు. అప్పటి నుండి పోలీసులు వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో తమ్మినేని సీతారాం బుధవారం ఉదయం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
భూ కబ్జా కుట్ర కేసు - పోలీసుల విచారణకు తమ్మినేని హాజరు
10 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 29, 2026, 12:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)