ప్రజాశక్తి - గుంటూరుజిల్లా ప్రతినిధి : టిడిపి కూటమి ప్రభుత్వం వైసిపి నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరులోని తన కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నూజివీడు పొగాకు వ్యాపారంలో వచ్చిన స్వల్ప వివాదంలో మాజీ ఎమ్మెల్యే ముస్తాఫా, ఆయన కుమారుడిపై కిడ్నాప్ కేసు నమోదు చేశారన్నారు. పొగాకు వ్యాపార లావాదేవీల్లో ఏర్పడిన వివాదాన్ని రాజకీయంగా మల్చుకునేందుకు ప్రయత్నించి, సహచర వ్యాపారిని కిడ్నాప్ చేసినట్టు ముస్తాఫాపై కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది చాలా అక్రమ కేసు అని పేర్కొన్నారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కూడా ఇలానే అక్రమ కేసులు నమోదు చేసి వారి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఒక వైపు రాజకీయంగా అక్రమ కేసులు పెడుతూ మరో వైపు కుటుంబ వివాదాలు, వ్యాపార వివాదాలను ఆసరాగా చేసుకుని అక్రమ కేసులు బనాయించడం టిడిపి కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ తగిన మూల్యం చెల్లించుకుంటారని అన్నారు.
Print Editionఅక్రమ కేసులతో వేధింపులు తగవు : అంబటి
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 29, 2026, 11:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)