గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

91.95శాతం మంది చిన్నారులకు పోలియో చుక్కలు

28 జూన్, 2026

satya kumar yadav
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 28, 2026, 09:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- వైద్య, ఆరోగ్య శాఖమంత్రి సత్యకుమార్‌ యాదవ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నేషనల్ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా నిర్వహించిన పల్స్‌‌పోలియో కార్యక్రమానికి మంచి స్పందన కనిపించిందని వైద్య, ఆరోగ్య శాఖమంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 0-5 ఏళ్ల లోపు వయసు కలిగిన చిన్నారులు 49,20,239 మంది ఉండగా వీరిలో 45,24,116 (91.95శాతం) మందికి పోలియో చుక్కలు వేసినట్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మిగిలిన వారి ఇళ్లకు వైద్య సిబ్బంది సోమ, మంగళవారాల్లో వెళ్లి చుక్కలు వేయనున్నారని వెల్లడించారు. ఎన్టీఆర్, మార్కాపురం, కృష్ణా జిల్లాల్లో చుక్కలు వేయించుకున్న వారి శాతం 115.16శాతం, 113.21శాతం, 104.29శాతం చొప్పున నమోదైందని తెలిపారు.తక్కువగా కర్నూలు జిల్లాలో 73.58శాతం, అన్నమయ్య జిల్లాలో 79. 90శాతం, నంద్యాల జిల్లాలో 80.91శాతం చొప్పున చుక్కల పంపిణీ జరిగిందని పేర్కొన్నారు. పల్స్ పోలియో కార్యక్రమాల్లో క్షేత్రస్థాయిలో 1.31 లక్షల మంది సిబ్బంది పాల్గొన్నారని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు వెల్లడించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్