ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపి ధార్మిక దత్త సంస్థల ట్రిబ్యునల్ చైర్‌పర్సన్‌గా రిటైర్డ్ జిల్లా జడ్జి ఏ. భారతిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎపి చారిటబుల్ అండ్ హిందూ రిలిజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ చట్టం–1987, ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ నిబంధనలు–2010 ప్రకారం ఈ నియామకం చేపట్టినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. భారతి పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి మూడేళ్లపాటు లేదా 65 ఏళ్ల వయస్సు పూర్తయ్యే వరకు, ఈ రెండింటిలో ఏది ముందైతే అప్పటి వరకు చైర్‌పర్సన్‌గా కొనసాగనున్నారు. చైర్‌పర్సన్‌కు చెల్లించాల్సిన వేతనం, ఇతర భత్యాలను ప్రభుత్వం తరువాత నిర్ణయిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. నియామకానికి సంబంధించిన తదుపరి చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్, ఎపి ధార్మిక దత్త సంస్థల ట్రిబ్యునల్ పరిపాలనాధికారిని ఆదేశించింది.








కామెంట్‌లు (0)