ప్రజాశక్తి - ఎడ్యుకేషన్ (విజయవాడ): ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన అంతర్జాతీయ ఆర్చర్లు బొమ్మదేవర ధీరజ్, టి.గణేష్ మణిరత్నంలకు మంగళవారం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. శాప్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ప్రతినిధులు ఆర్చర్లకు పూలమాలలతో స్వాగతం పలికి సత్కరించారు. ఇదే సమయంలో విమానాశ్రయంలో ఉన్న రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్‌లు కూడా క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా ధీరజ్, గణేష్‌లు మాట్లాడుతూ.. తమ విజయాలకు తల్లిదండ్రులు, ఆర్చరీ అసోసియేషన్ చైర్మన్ చెరుకూరి సత్యనారాయణ ప్రోత్సాహం, రాష్ట్ర ప్రభుత్వ సహకారమే కారణమని కృతజ్ఞతలు తెలిపారు. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడమే తమ తదుపరి లక్ష్యమని, అందుకోసం కఠిన శిక్షణ పొందుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాశాఖ అధికారులు, వివిధ జిల్లాల ఆర్చరీ సంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)