మంగళవారం, 25 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనైపుణ్యం, శ్రమ కలబోసిన కళాకారుడు ఫొటో జర్నలిస్ట్‌

1 గంట క్రితం

photoday
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 25, 2026, 09:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • సిఆర్‌ మీడియా అకాడమీ చైర్మన్‌ ఆలపాటి సురేష్‌

ప్రజాశక్తి - విజయవాడ అర్బన్‌ : నైపుణ్యం, శ్రమ కలబోసిన కళాకారుడు ఫొటో జర్నలిస్టు అని సిఆర్‌ మీడియా అకాడమీ చైర్మన్‌ ఆలపాటి సురేశ్ కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్టుల అసోసియేషన్ (ఎపిపిజెఎ) ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ ఫొటో కాంటెస్ట్-2026 అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. సిఆర్‌ మీడియా అకాడమీ, ఎపి స్టేట్ క్రియేటివ్ అండ్ కల్చరర్ కమిషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమానికి తోడ్పాటునందించాయి. ఈ కార్యక్రమంలో ఆలపాటి మాట్లాడుతూ.. వార్తకు ఫొటో ప్రాణం పోస్తుందనడంలో అతిశయోక్తికాదన్నారు. ఒక అంశాన్ని చిత్రం (ఫొటో)తో వివరించడం ద్వారా అది పాఠకులకు మరింత చేరువ అవుతుందన్నారు. ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఫొటోగ్రఫీ రంగంలో కూడా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. దీనిపై ఫొటో జర్నలిస్టులు నూతన, సాంకేతికతను అలవర్చుకోవాలని సూచించారు. గౌరవ అతిథి, ఐజెయు ప్రధాన కార్యదర్శి డి.సోమ సుందర్ మాట్లాడుతూ... సమాజంలోని వాస్తవ పరిస్థితులను ప్రజల ముందుకు తీసుకువచ్చే శక్తివంతమైన మాధ్యమం ఫొటోగ్రఫీ అని అన్నారు. ఒక్క ఫొటో వెయ్యి మాటలను చెప్పగలదని వివరించారు. ఎపిపిజెఎ అధ్యక్షులు సిహెచ్.వి.ఎస్.విజయ భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి జి.మహేష్ మాట్లాడుతూ... ఫొటోగ్రఫీ పోటీలకు 15 రాష్ట్రాల నుండి 110 మంది ద్వారా 440 ఫొటోలు వచ్చాయని తెలిపారు. ముందుగా అవార్డులకు ఎంపికైన ఫొటోలతో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ ను ముఖ్య అతిథులు తిలకించి ఫొటో జర్నలిస్టులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎపిపిజెఎ గౌరవ అధ్యక్షులు జి.వి.నారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ వి.రూబిన్, కోశాధికారి సిహెచ్.నారాయణరావు, ఎపియుడబ్ల్యుజె ప్రధాన కార్యదర్శి కె.జయరాజు, నాయకులు సిహెచ్.వి.మస్తాన్, చావా రవి, దారం వెంకటేశ్వరరావు, ఎస్‌‌కె.బాబు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్