ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సంప్రదాయ హస్తకళల వారసత్వ పరిరక్షణ, హస్తకళాకారులకు చేయూతనిచ్చేందుకు చేపట్టిన పనులను వేగవంతం చేయాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ తెలిపారు. హస్తకళాకారుల సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పన, మెరుగైన మార్కెటింగ్ వసతుల కల్పన ద్వారా మెరుగైన జీవనోపాధి, ఆరోగ్య రక్షణ తదితర అంశాలను అత్యంత ప్రాధాన్యతా క్రమంలో ముందుకు తీసుకెళ్లాలని మంగళవారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. సవర , గిరిజన చిత్రకారుల కోసం పార్వతీపురం మన్యం జిల్లా, సీతంపేట మండలంలో కామన్ ఫెసిలిటీ కోసం స్థల సేకరణ పూర్తి చేయడంతో పాటు విబి గ్రామ్ జి నిధులతో నిర్మాణ పనులు కూడా ప్రారంభించామన్నారు. దీంతో పాటు అన్నమయ్య జిల్లా మదనపల్లి బంజారా బ్యాగ్ కళాకారులు, అనంతపురం జిల్లా కురుగుంట్ల అరటినారు కళాకారులు, పెడన పెన్ కలంకారీ కళాకారుల కోసం ఏర్పాటు చేయనున్న కమ్యూనిటీ సెంటర్ స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)