మంగళవారం, 29 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionస్టీల్‌‌ప్లాంట్‌‌లో ప్రమాదం

6 గంటల క్రితం

స్టీల్‌‌ప్లాంట్‌‌లో ప్రమాదం 
- ఎస్ఎంఎస్‌-1 సిసిడిలో నేలపాలైన ఉక్కు ద్రవం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 10:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఎస్ఎంఎస్‌-1 సిసిడిలో నేలపాలైన ఉక్కు ద్రవం

ప్రజాశక్తి - ఉక్కునగరం (విశాఖపట్నం) :వైజాగ్‌ ‌స్టీల్‌‌ప్లాంట్‌‌లో మంగళవారం ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్ఎంఎస్‌-1 సిసిడి విభాగంలో ఉక్కు ద్రవాన్ని తరలిస్తున్న లాడిల్‌ స్లైడ్‌ గేట్‌ మూత సక్రమంగా పడకపోవడంతో ఉక్కు ద్రవం నేలపైకి జారిపోయింది. ఘటన సమయంలో ఉక్కు ద్రవం భారీ ఉష్ణోగ్రతతో ఉంది. నేలపైకి ఒక్కసారిగా పడటంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదే ప్రాంతంలో రెండు నెలల క్రితం లాడిల్‌ బ్లాస్ట్‌ ఘటనలో పది మంది కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. మరోసారి ఇటువంటి ఘటన కార్మికుల్లో ఆందోళన కలిగిస్తోంది. గత ప్రమాదం తర్వాత భద్రతా చర్యలు, పరికరాల నిర్వహణపై పలు ప్రశ్నలు తలెత్తిన నేపథ్యంలో తాజాగా లాడిల్‌ స్లైడ్‌గేట్‌ మూత సక్రమంగా పనిచేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.

​ఎస్ఎంఎస్‌-2లో కార్మికునికి గాయాలు...

స్టీల్‌ప్లాంట్‌లోని ఎస్ఎంఎస్‌-2లో కాంట్రాక్టు కార్మికుడు నాగరాజు గాయపడ్డారు. కన్వర్టర్‌-3పై పనిచేస్తున్న ఆయన ప్రమాదవశాత్తు జారిపడటంతో భుజానికి గాయాలు కావడంతో అధికారులు స్టీల్‌ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని కార్మికులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్