ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అమెరికాలో ప్రమాదం.. దుళ్ల యువకుడు దుర్మరణం

2 గంటల క్రితం

kadiyam.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026, 08:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - కడియం: తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన కంటిపూడి కేశవ్‌ చౌదరి (27) అమెరికాలో జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. ఆయన టీడీపీ నాయకుడు కంటిపూడి శ్రీనివాస్‌ కుమారుడు. కేశవ్‌ అమెరికాలో ఎంఎస్‌ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం మిత్రులతో కలిసి జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయినట్లు బంధువులు తెలిపారు. ఆయన మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేశవ్‌ మృతిపై ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్