సోమవారం, 05 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పడిపోవడం... కాపాడటం... క్షణాల్లో..

1 గంట క్రితం

raiway
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026, 11:51 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- కదులుతున్న రైలు ఎక్కబోయి జారిన ప్రయాణికుడు - కాపాడిన కానిస్టేబుల్

అనంతపురం: కదులుతున్న రైలును ఎక్కే ప్రయత్నంలో అదుపుతప్పి ప్లాట్‌ఫాం, రైలుకు మధ్యలో పడిపోతున్న ఓ ప్రయాణికుడిని ట్రాఫిక్ కానిస్టేబుల్ సకాలంలో రక్షించాడు. అనంతపురం రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రవి కుమార్ అనే ప్రయాణికుడు కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా అదుపుతప్పి కిందపడిపోయాడు. అతడు ప్లాట్‌ఫాం, రైలు మధ్యలోకి జారిపోతుండటాన్ని గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సి. సురేంద్రన్ వెంటనే స్పందించాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రయాణికుడి కాలర్‌ను పట్టుకుని అతడిని ప్రమాదకరమైన స్థితి నుంచి బయటకు లాగాడు. ఈ ఘటనను గమనించిన ఇతర పోలీసులు కూడా వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అదృష్టవశాత్తూ రవి కుమార్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అనంతరం తన ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ సురేంద్రన్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. కానిస్టేబుల్ అప్రమత్తత, క్షణాల్లో స్పందించిన తీరు కారణంగా పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికుడిని కాపాడిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కానిస్టేబుల్ సురేంద్రన్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.





ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్