కలెక్టర్లకు మంత్రి లోకేష్ ఆదేశం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ పాఠశాలల్లో నూరు శాతం ఫలితాలు సాధించేలా కలెక్టర్లు కార్యాచరణ చేపట్టాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో భాగంగా శుక్రవారం ఆయన విద్యాశాఖపై సమీక్షలో మాట్లాడారు. బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం మరింత పెరిగేలా చూడాలన్నారు. పాఠశాల భవనాలు పటిష్టంగా ఉండాలని, నిర్మాణాలు నాణ్యంగా ఉండాలని తెలిపారు. ఐటిఐ, పాలిటెక్నిక్ కళాశాలలను వివిధ పరిశ్రమలతో అనుసంధానిస్తూ పరిశ్రమలకు తగిన నైపుణ్యాలను అందిపుచ్చుకునేలా చేస్తున్నామన్నారు. నైపుణ్యం వెబ్ పోర్టల్ ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు స్కిల్ టూల్స్ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అక్షరాస్యతతో పాటు డిజిటల్, ఫైనాన్షియల్ లిటరసీపైనా విద్యాశాఖ పని చేస్తోందన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్వయం రక్షణపైనా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. కరిక్యులమ్ మార్పుపై రోడ్ మ్యాప్‌ను రూపొందించుకుని పని చేస్తున్నామని తెలిపారు.








కామెంట్‌లు (0)