గురువారం, 03 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionWomen's Asia Cup : మంధాన మెరుపు శతకం

1 గంట క్రితం

mandhana-2.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 03, 2026, 11:42 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • మిథాలీ రాజ్‌ రికార్డు బ్రేక్‌

  • హాంకాంగ్‌పై గెలుపుతో సెమీస్‌బెర్త్‌

దుబాయ్‌: ఆసియాకప్‌ ‌మహిళల క్రికెట్‌ ‌టోర్నీ సెమీఫైనల్లో భారత జట్టు ప్రవేశించింది. దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ ‌స్టేడియంలో హాంకాంగ్‌‌తో గురువారం జరిగిన మ్యాచ్‌‌లో భారతజట్టు 137పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సెమీస్‌ ‌బెర్త్‌ ‌సాధించింది. తొలుత ఓపెనర్‌ స్మృతి మంధాన రికార్డు శతకంతో రాణించడంతో తొలిగా బ్యాటింగ్‌‌కు దిగిన హర్మన్‌ప్రీత్‌ ‌సేన నిర్ణీత 20ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. భారీ ఛేదనలో దీప్తి శర్మ(3/9), నందిని (2/6), శ్రీచరణి(2/16), ప్రేమ రావత్‌(2/12) బౌలింగ్‌‌లో రాణించడంతో హాంకాంగ్‌(చైనా) 16.2 ఓవర్లలో 56 పరుగులకు ఆలౌటైంది. 4వికెట్ల నష్టానికి 52పరుగులతో పటిష్టంగా ఉన్న హాంకాంగ్‌ ‌జట్టు కేవలం 4పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయింది. హాంకాంగ్‌ ‌బ్యాటర్లు మిల్స్‌(15), యాస్మినే(11), మారినా(14) మాత్రమే రెండంక్కెల స్కోర్‌ ‌చేశారు. ప్లేయర్‌ ఆఫ్‌ ‌ది మ్యాచ్‌ ‌మంధానకు లభించింది. అంతకుముందు తొలిగా బ్యాటింగ్‌‌కు దిగిన భారత మహిళల జట్టు భారీస్కోర్‌ ‌నమోదు చేసింది. మంధాన కేవలం 58 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్న కోవడంతోపాటు మొత్తంగా 64 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 124 పరుగులు చేసింది. అయితే, దురదృష్టవశాత్తూ ఆఖరి ఓవర్లో రనౌట్‌ అయింది. మరో ఓపెనర్‌ షఫాలి వర్మ (28) దూకుడుగా ఆడే క్రమంలో త్వరగానే పెవిలియన్‌ చేరింది. మిగిలిన వారిలో ప్రతికా రావల్‌ (10), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (11) నిరాశపరిచారు. భారతి ఫుల్మలి రెండు, దీప్తి శర్మ ఒక పరుగుతో అజేయంగా నిలిచారు.

మిథాలీ రికార్డు బ్రేక్‌..

మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన మిథాలీ రాజ్‌ (10,868 పరుగులు) రికార్డును స్మృతి మంధాన అధిగమించింది. హాంకాంగ్‌(చైనా)తో గురువారం జరిగిన మ్యాచ్‌‌లో మంధాన సెంచరీ నమోదు చేసింది. దీంతో మహిళల క్రికెట్‌‌లో అత్యధిక సెంచరీలు, అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌‌గా మంధాన రికార్డు నెలకొల్పింది. అలాగే మహిళల ఆసియా కప్‌ టి20 చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ప్లేయర్‌గానూ స్మృతి (124 పరుగులు) నిలిచింది. ఇంతకుముందు శ్రీలంక కెప్టెన్‌ ఆటపట్టు (119పరుగులు) పేరిట ఉంది.

స్కోర్‌‌బోర్డు...

ఇండియా మహిళలు : మంధాన (రనౌట్‌)ఇక్రా సహర్‌/‌యాస్మినే 124, షెఫాలీ వర్మ (సి)మారినా (బి)రుచితా 28, ప్రతికా రావల్‌ (‌సి)మర్యామ్‌ (‌బి)జోలీన్‌ ‌కౌర్‌ 10, రీచా ఘోష్‌ (‌సి అండ్‌ ‌బి)మారినా 11, హర్మన్‌‌ప్రీత్‌ ‌కౌర్‌ (‌సి)జోలిన్‌ ‌కౌర్‌ (‌బి)మారినా 10, ఫుల్మాలీ (నాటౌట్‌) 2, దీప్తి శర్మ (నాటౌట్‌) 1, అదనం 7. (20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి) 193 పరుగులు. వికెట్ల పతనం: 1/74, 2/111, 3/151, 4/185, 5/190 బౌలింగ్‌: ఇక్రా సహర్‌ 4-0-28-0, కారీ ఛాన్‌ 3-0-28-0, మారినా 4-0-46-2, మర్యామ్‌ ‌బిబి 2-0-29-0, ఆలీసోన్‌ ‌సుయ్‌ 3-0-19-0, రుచితా వెంకటేశ్‌ 2-0-30-1, జోలిన్‌ ‌కౌర్‌ 2-0-12-1.

హాంకాంగ్‌ ‌మహిళలు : మిల్స్‌ (‌సి)రీచా (బి)ప్రేమా రావత్‌ 15, హిల్‌ (‌బి)నందిని శర్మ 0, యాస్మిన్‌ (‌సి)భారతి (బి)దీప్తి 11, కరీ చాన్‌ (‌సి)షెఫాలీ (బి)ప్రేమా రావత్‌ 1, లాంప్లోహ్ (సి)నందిని (బి)శ్రీచరణి 14, మర్యమ్‌ (‌సి)షెఫాలీ (బి)నందిని 7, షాంజీన్‌ (‌స్టంప్‌)‌రీచా (బి)శ్రీచరణి 2, ఆలీసన్‌ (‌బి)దీప్తి 1, ఇక్రా సహర్‌ (‌సి)రీచా (బి)దీప్తి 0, జోలిన్‌ ‌కౌర్‌ (‌రనౌట్‌)‌మంధాన/రీచా 1, రుచిత (నాటౌట్‌) 0, అదనం 4. (16.2ఓవర్లలో ఆలౌట్‌) 56‌పరుగులు.

వికెట్ల పతనం: 1/2, 2/29, 3/31, 4/36, 5/52, 6/54, 7/55, 8/55, 9/56, 10/56. బౌలింగ్‌: క్రాంతి 3-1-5-0, నందిని 3-0-6-2, షెఫాలీ 1-0-4-0, శ్రీచరణి 3.2-0-16-2, దీప్తి 3-0-9-3, ప్రేమా రావత్‌ 3-0-13-2.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్