ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దేశంలో ప్రజాస్వామ్యాన్ని హతం చేసే చర్యలు మానుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శిలు పి.రామ్ మోహన్, కె.ప్రసన్న కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో హితవు పలికారు. కేంద్రంలో బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బహిరంగంగా విమర్శిస్తున్న పాత్రికేయుల, విద్యావంతులు, విద్యార్థులపై ఉపా చట్టాన్ని అమలు చేసి అప్రజాస్వామికంగా వారి గొంతు నొక్కే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసిందని విమర్శించారు. ఆ విష సంస్కృతిని రాష్ట్రంలో తీసుకొచ్చి ప్రశ్నా యూ ట్యూబర్ రావణ్ వంటి వ్యక్తులను అరెస్టు చేయడాన్ని ప్రజాస్వామ్య వాదులు, విద్యావంతులు, పౌర హక్కుల నేతలందరూ ఖండించాలని పిలుపునిచ్చారు.ఉప ముఖ్యమంత్రే గత కొంత కాలంగా మతాలు, సనాతన ధర్మం, తిరుపతి లడ్డూ పేరుతో రాజ్యాంగబద్ద పదవిలో ఉంటూ ప్రజల మత విశ్వాశాలపై రెచ్చగోట్టి రాజకీయ లబ్ది పొందాలని చూశారని గుర్తు చేశారు. ప్రశ్నించే వారిని ఉగ్ర వాదులు,అర్బన్ నక్సల్స్ గా ముద్ర వేసి హరించే ప్రయత్నం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రశ్న రావణ్ ను తక్షణమే విడుదల చేసి అన్నీ కేసులను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
ప్రజాస్వామ్యాన్ని హతం చేసే చర్యలు మానుకోవాలి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 10, 2026, 09:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)